ప్రయాణికుల రైళ్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే విషయంలో రైల్వేశాఖ స్పష్టతనిచ్చింది. ఫలానా తేదీ నుంచి రైళ్లను ప్రారంభిస్తారంటూ మీడియాలో వస్తున్న కథనాలపై స్పందిస్తూ.. అలాంటి తేదీ అని తాము నిర్ణయించలేదంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
దశలవారీగా..
ఏప్రిల్‌లో ఫలానా తేదీ నుంచి అన్ని ప్రయాణికుల రైళ్లను ప్రారంభిస్తారంటూ కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయని రైల్వే శాఖ పేర్కొంది. అలాంటి తేదీ ఏదీ తాము నిర్ణయించలేదని తెలిపింది. ఇప్పటికే 65 శాతం రైళ్లు.. ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. దశలవారీగా రైళ్లను అందుబాటులోకి తెస్తున్నామని, అదే తరహాలో భవిష్యత్‌లో మిగిలిన రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది. కొవిడ్ నేపథ్యంలో రైళ్లన్నీ పూర్తిగా నిలిచిపోగా.. ప్రస్తుతం ప్రత్యేక రైళ్ల పేరిట కొన్ని రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.
ఇదీ చదవండి:ప్రశాంత్ కిశోర్ ఇంటి ప్రహరి కూల్చివేత