జనతా దళ్ యునైటెడ్(జేడీయూ)లో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడైన ఆర్సీపీ సింగ్‌కు జేడీయూ పగ్గాలు అప్పగించనున్నట్లు సమాచారం.
జేడీయూ కొత్త అధ్యక్షుడిగా ఆర్సీపీ సింగ్! - జేడీయూ ఆర్సీపీ సింగ్
15:16 December 27
జేడీయూ కొత్త అధ్యక్షుడిగా ఆర్సీపీ సింగ్!
ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఫలితాలు, అరుణాచల్‌ప్రదేశ్‌లో పార్టీని వీడి ఆరుగురు ఎమ్మెల్యేలు భాజపా తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో జేడీయూ అధ్యక్షుడి మార్పు అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది.
నితీశ్ కుమార్‌కు ఆర్సీపీ సింగ్ అత్యంత సన్నిహితుడు. జేడీయూ మండలి సమావేశంలో ఆర్సీపీ సింగ్ పేరును నితీశ్ స్వయంగా ప్రతిపాదిస్తూ తీర్మానం చేసినట్టు తెలుస్తోంది. అనంతరం నితీశ్ తీర్మానానికి ఏకగీవ్రంగా ఆమోదం లభించినట్టు సమాచారం.
ఇదీ చూడండి:-బంగాల్ బరిలో జేడీయూ.. భాజపాపై ప్రభావమెంత?