పర్యావరణానికి మేలు చేసే పెయింట్లు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆవుపేడతో తయారై త్వరలో మార్కెట్లోకి రానున్న 'వేదిక్ పెయింట్స్'ను ట్విట్టర్ ద్వారా పరిచయం చేశారు. దీనిని ఖాదీ, గ్రామీణ పరిశ్రమ కమిషన్ ఆధ్వర్యంలో తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో పాడి రైతులకు పరోక్షంగా 55వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు.
ఆవుపేడతో రైతుల ఆదాయాన్ని పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాం. గోవు ఉత్పత్తులను రైతులు సొమ్ముచేసుకునేలా భిన్నమైన ఆలోచనలను ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికే ఆవుపేడతో వివిధ ఉత్పత్తులు తయారుచేస్తుండగా వేదిక్ పెయింట్స్ ఆలోచన మరింత మంది రైతులకు లాభదాయకంగా ఉంటుంది.