Nirmala Sitharaman on Rahul Gandhi: బడ్జెట్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను చూసి తాను జాలి పడుతున్నానని అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పేదలు, మధ్యతరగతి ప్రజలు, వేతన జీవుల కోసం బడ్జెట్లో ఏమీ లేదన్న రాహుల్ విమర్శలను ఆమె తోసిపుచ్చారు. ట్విట్టర్లో ఏదొకటి పోస్ట్ చేయాలన్న హడావుడిలో ఇలా అనడం తగదని, సరైన హోంవర్క్ చేయాలని హితవు పలికారు. బడ్జెట్‌ను పూర్తిగా అర్థం చేసుకుని విమర్శిస్తే సమాధానం చెప్పేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు నిర్మల.
బడ్జెట్ విమర్శలపై స్పందించిన ఆర్థిక మంత్రి బడ్జెట్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన నిర్మల.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పంజాబ్‌లో నిరుద్యోగం, మహారాష్ట్రలో పత్తిరైతుల ఆత్మహత్యల సంగతేంటని నిలదీశారు.
తెలివి ఉండాలిగా..
"జీరో సమ్ బడ్జెట్" అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. "బడ్జెట్‌ను అర్థం చేసుకోవాలంటే వారికి (విపక్ష నేతలకు) తెలివి ఉండాలి. లెక్కలు అర్థం చేసుకోవడంలో రాహుల్‌కు ఇబ్బంది ఉంది. ఆయనకు ప్రతిదీ సున్నాలాగానే కనిపిస్తుంది. తెలివైన వారంతా బడ్జెట్‌ను స్వాగతించారు. అందులోని దార్శనికతను అర్థం చేసుకున్నారు.
దేశాభివృద్ధికి తన బడ్జెట్ ద్వారా ఆర్థిక మంత్రి దారి చూపారు. మధ్యతరగతిపై పన్ను భారం ఇప్పటికే గణనీయంగా తగ్గింది. వనరుల సంరక్షణ, అవకాశాల పెంపు, ఆదాయం వృద్ధికే మా ప్రయత్నాలన్నీ." అని స్పష్టం చేశారు గోయల్.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి :'ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్- సామాన్యులకు నమ్మకద్రోహం!'