ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో జరుగుతున్న పవిత్ర కుంభమేళాను కరోనా వ్యాప్తి దృష్ట్యా ఏప్రిల్ 17న ముగిస్తున్నట్లు 13 అఖాడాలలో ఒకటైన నిరంజని అఖాడా ప్రకటించింది. ఈమేరకు అఖాడా పరిషత్‌లో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు నిరంజని అఖాడా కార్యదర్శి రవీంద్ర పూరి మహారాజ్ తెలిపారు. కుంభమేళాలో చివరి రాజస్నానం ఏప్రిల్ 27న నిర్వహించాల్సి ఉండగా కొవిడ్ బారిన పడుతున్న సాధువుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
కరోనాతో ముందే ముగియనున్న కుంభమేళా!
ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న కుంభమేళాను కరోనా పరిస్థితుల దృష్ట్యా ముందుగానే ముగిస్తున్నట్లు 13 అఖాడాలలో ఒకటైన నిరంజని అఖాడా ప్రకటించింది. ఈ మేరకు నిరంజని అఖాడా కార్యదర్శి రవీంద్ర పూరి మహారాజ్ తెలిపారు.
కరోనాతో ముందే ముగియనున్న కుంభమేళ
కుంభమేళాలో పాల్గొన్న 30 మంది నాగసాధువులకు కొవిడ్ నిర్ధరణ అయ్యినట్లు పేర్కొన్నారు. హరిద్వార్‌లో ఐదు రోజుల వ్యవధిలో 2 వేల 167 మంది కరోనా బారినపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో కుంంభమేళాను ముగిస్తున్నట్లు మహారాజ్ పూరి తెలిపారు.
ఇదీ చూడండి:కుంభమేళ: గంగానదిలో భక్తుల పుణ్యస్నానాలు