తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెరుగుతున్న కేసులు- మళ్లీ కర్ఫ్యూ విధింపు - రాత్రిపూట కర్ఫ్యూ

పుణెలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి11 గంటల నుంచి ఉదయం6 గంటల వరకు కర్ఫ్యూ ఉండనుందని పేర్కొంది. పుణెలో కరోనా కేసులు విపరీతంగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Night curfew has been imposed in Pune
పుణెలో రాత్రిపూట కర్ఫ్యూ విధింపు

By

Published : Feb 21, 2021, 1:25 PM IST

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మహారాష్ట్ర పుణెలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 11గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫూ ఉంటుందని తెలిపింది. ఇది.. ఆదివారం రాత్రి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది.

అదే సమయంలో ఈ నెల 28 వరకు పుణెలో పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని ఆదేశించింది ప్రభుత్వం. ఉన్నతస్థాయి విద్యాసంస్థలు.. 50శాతం ఆక్యుపెన్సీతో నడుపుకోవచ్చని తెలిపింది. అయితే హోటళ్లు, రెస్టారెంట్లు రాత్రి 11 గంటల వరకు మాత్రమే తెరవచ్చని వెల్లడించింది.

దేశవ్యాప్తంగా..

దేశవ్యాప్తంగానూ కేసులు పెరుగుతున్నాయి. భారత్​లో నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో 74శాతం.. కేరళ, మహారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​లలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నట్లు పేర్కొంది. పరీక్షల సామర్థ్యం పెంచాలని, తగిన చర్యలు చేపట్టాలని ఆయా రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

ఇదీ చూడండి:దేశంలో మరో 14,264 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details