తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూగజీవాల కోసం మూడు అంతస్తుల భవనం.. జంతువుల నేస్తం ఈ నిధి

అనారోగ్యంతో మూలిగే మూగజీవులను ఇంటికి తీసుకొచ్చి, సపర్యలు చేస్తున్నారు.. బిలాస్‌పుర్‌లోని కుడుదండ్‌ శివ్‌చౌక్‌కు చెందిన 27 ఏళ్ల నిధి తివారి. వాటి కోసం మూడు అంతస్తుల భవనాన్ని కేటాయించి వాటిని పోషిస్తున్నారు.

animal lover Nidhi Tiwari
animal lover Nidhi Tiwari

By

Published : Sep 25, 2022, 3:48 PM IST

మూగజీవాల కోసం మూడు అంతస్తుల భవనం

వృద్ధాప్యంతో, అనారోగ్యంతో ఉన్న శునకాలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులను కొందరు వీధుల్లో వదిలేస్తుంటారు. దీంతో ఒక్కసారిగా వాటి బతుకు దుర్భరంగా మారిపోతుంది. తిండి లేక, ఆరోగ్యం కుదుటపడక అవి నానాటికీ బక్కచిక్కిపోతుంటాయి. తన కంట పడిన అలాంటి జంతువులకు.. అన్నీ తానై చూసుకుంటున్నారు నిధి తివారీ.

మూగజీవాలకు చికిత్స అందిస్తున్న నిధి తివారి

ఛత్తీస్​గఢ్​ బిలాస్​పుర్​కు చెందిన నిధి తివారీకి జంతువులంటే ఎనలేని ప్రేమ. సరైన ఆహారం లేక తీవ్ర అవస్థలు పడుతున్న మూగజీవాలను చూసి చలించిన నిధి.. వాటిని సాకేందుకు ఏకంగా మూడు అంతస్తుల భవనాన్ని కేటాయించారు. వాటికి చక్కటి వైద్యం అందించి, ఆహారం అందిస్తున్నారు. పోలీసులు, అటవీ అధికారులు, ప్రజలు ఇలాంటి జీవాలను చూసి తనకు సమాచారం ఇస్తుంటారని ఆమె తెలిపారు. ఓసారి గుడిలో బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్న మేకను రక్షించేందుకు కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ తనకు సాయం చేసినట్టు చెప్పారు నిధి.

జంతు సంరక్షుకురాలు నిధి తివారి
మూగజీవాలకు చికిత్స అందిస్తున్న నిధి తివారి

"ఓ ఆలయంలో చిన్న మేకపిల్లను బలి ఇస్తున్నారని తెలిసింది. నేను వెంటనే వెళ్లేసరికి బలి ఇవ్వడానికి పూర్తిగా సిద్ధం చేశారు. ఆ మేక భయంతో అరుస్తోంది. నన్ను రక్షించండి అన్నట్టుగా ఆ ఆరుపులు నాకు వినిపించాయి. ఒక జీవి ప్రాణం తీసి చేసే పూజతో ఏ దేవుడు సంతోషిస్తాడు? బలిని అడ్డుకున్నాను. నిర్వహకులపై ఫిర్యాదు చేసి ఆ మేకను తీసుకువచ్చాను."

నిధి తివారీ, జంతు సంరక్షురాలు

గాయపడిన జంతువుల చికిత్సకోసం రూ. 30,000 వరకు అవుతోందని చెప్పారు నిధి తివారి. నిధి కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఎంతో ప్రేమతో ఈ పెంపుడు జంతువులను చూసుకుంటుండటం విశేషం. నిర్వహణలో తన సోదరుడు, తండ్రి సహాయపడతారని చెప్పారు. తనకు ఇన్​స్టాగ్రామ్​లో లక్ష మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారని.. వారందరూ సాయం చేస్తున్నారని తెలిపారు. వేర్వేరు జాతుల జంతువులను విడివిడిగా ఉంచుతానని.. అవి ఇష్టపడే ఆహారాన్ని అందిస్తానని చెప్పారు.

ఇవీ చదవండి;'11 మంది సంతానం.. ఎవరూ పట్టించుకోవట్లేదు.. అనుమతిస్తే చనిపోతా'

తలాక్ చెప్పిన భర్త.. అతడి మిత్రుడితో మహిళ కొత్త జీవితం.. 'పుష్ప'గా పేరు మార్చుకొని..

ABOUT THE AUTHOR

...view details