NIACL AO Recruitment 2023 : ఉన్నత విద్యను అభ్యసించి, ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ 450 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (స్కేల్-1) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- రిస్క్ ఇంజినీర్స్ - 36
- ఆటోమొబైల్ ఇంజినీర్స్ - 96
- లీగల్ - 70
- అకౌంట్స్ - 30
- హెల్త్ - 75
- ఐటీ - 23
- Generalists - 120
విద్యార్హతలు
NIACL AO Eligibility :
- ఇంజినీరింగ్ జాబ్స్ విషయంలో ఆయా పోస్టులను అనుసరించి బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- లీగల్ ఆఫీసర్ ఉద్యోగాలకు.. లా గ్రాడ్యుయేషన్ లేదా లా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.
- అకౌంట్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు.. చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) చేసి ఉండాలి.
- హెల్త్ ఏవో పోస్టులకు.. ఎంబీబీఎస్/ఎండీ /ఎంఎస్/పీజీ మెడికల్ డిగ్రీ లేదా బీడీఎస్/ఎండీఎస్/ లేదా బీఏఎంఎస్/ బీహెచ్ఎంఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ఐటీ స్పెషలిస్ట్ పోస్టులకు.. బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ లేదా ఎంసీఏ చేసి ఉండాలి.
వయోపరిమితి
NIACL AO Age Limit : అభ్యర్థుల వయస్సు 2023 ఆగస్టు 1 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్-సర్వీస్మెన్, డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.