జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా ఏడు ప్రాంతాల్లో సోమవారం సోదాలు నిర్వహిస్తోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు సహకరించే వారే లక్ష్యంగా ఈ చర్య చేపట్టినట్టు తెలుస్తోంది. దిల్లీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అనుమానితులు నివసిస్తున్న ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు ఎన్ఐఏ వర్గాల సమాచారం.
'భారత్‌లో ఐసిస్'పై ఎన్ఐఏ గురి- 7 చోట్ల సోదాలు - islamic state
ఐఎస్ ఉగ్రవాద సంస్థలకు ప్రభావితం అయ్యారని అనుమానిస్తున్న వ్యక్తుల ఇళ్లపై జాతీయ భద్రతా సంస్థ దాడులకు దిగింది. దిల్లీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు
దిల్లీలోని జాఫ్రాబాద్ ప్రాంతం సహా బెంగళూరులోని రెండు ప్రాంతాల్లో ఎన్ఐఏ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. వీటితో పాటు కేరళలోని కోచి, కన్నూరులోని నాలుగు ప్రాంతాల్లో అధికారులు సోదాలు జరపుతున్నారని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. అనుమానితులు అందరూ విద్యావంతులే అని, ఐఎస్‌కు ప్రభావితం అయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపాయి. విచారణ అనంతరం ఎన్ఐఏ వీరిని అరెస్టు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
ఇదీ చదవండి :సచిన్ వాజేకు మార్చి 25 వరకు రిమాండ్