తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేప్​ కేసుల్లో సాక్ష్యాల సేకరణకు కొత్త విధానం - లైంగిక వేధింపుల కేసులను సత్వరమే పరిష్కరించేలా 'ఎస్​ఓపీ'

అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణల కేసుల్లో ఫోరెన్సిక్​ సాక్ష్యాల సేకరణకు విధివిధానాలు ఖరారు చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్. విచారణలో జాప్యాన్ని నివారించేందుకే కొత్త ఎస్​ఓపీని తెచ్చినట్లు తెలిపింది.

NHRC issues SOP to fast track investigation of sexual assault cases
ఫోరెన్సిక్​ సాక్ష్యాల సేకరణ విధానంలో 'ఎస్​ఓపీ' అమలు

By

Published : Dec 16, 2020, 6:51 PM IST

లైంగిక వేధింపుల కేసుల్లో ఫోరెన్సిక్​ సాక్ష్యాల సేకరణ, పరిశీలన కోసం విధివిధానాలను రూపొందించింది జాతీయ మానవ హక్కుల కమిషన్​(ఎన్​హెచ్​ఆర్సీ). నిపుణల సలహాల మేరకు ఖరారు చేసిన ఈ ప్రామాణిక నిర్వహణా విధానం(ఎస్​ఓపీ)ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు పక్కాగా అమలు చేయాలని సూచించింది.

ఎస్​ఓపీని ఏడు కీలక భాగాలుగా విభజించింది నిపుణుల బృందం. బాధితుల సంరక్షణ, సత్వర పరీక్ష, నమూనాల సేకరణ, ఇతర ఆధారాలను ఫోరెన్సిక్​ ప్రయోగశాలకు అప్పగించడం సహా.. సంబంధిత మార్గదర్శకాలను ఇందులో పొందుపర్చారు.

ఇంతకుముందు ఉన్న విధానంలో ఫోరెన్సిక్​ సాక్ష్యాల సేకరణ ఆలస్యం అవుతోందన్న విమర్శలు వచ్చాయి. దీంతో ఫలితాలు తారుమారై, దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం పడుతోందన్న వాదనలు వినిపించాయి. ఈ జాప్యాన్ని నివారించేందుకే తాజా ఎస్​ఓపీని తీసుకొచ్చింది ఎన్​హెచ్​ఆర్సీ. ఈ విధానాన్ని సక్రమంగా అమలు చేయడం వల్ల కేసులను సత్వరమే పరిష్కరించడం సహా.. వ్యవస్థను మరింత పటిష్ఠం చేయవచ్చని అభిప్రాయపడింది.

ఇదీ చదవండి:రైల్వేస్టేషన్​లో యువతిపై సామూహిక అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details