తెలంగాణ

telangana

ఆక్సిజన్​ కంటైనర్లకు టోల్​ రుసుం మినహాయింపు

By

Published : May 8, 2021, 8:37 PM IST

దేశవ్యాప్తంగా డిమాండ్‌ దృష్ట్యా ఆక్సిజన్‌ కంటైనర్ల రవాణాలో అంతరాయం లేకుండా ఉండేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ ఆక్సిజన్‌ తరలించే కంటైనర్లకు టోల్‌ప్లాజాల వద్ద రుసుం మినహాయింపు ఇచ్చింది. వాటిని అత్యవసర వాహనాలుగా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

toll plaza
టోల్ ప్లాజా

దేశంలో కరోనా రెండోదశ వ్యాప్తి దృష్ట్యా.. ఆక్సిజన్​కు భారీ డిమాండ్ ఏర్పడ్డ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ ఆక్సిజన్‌ తరలించే కంటైనర్లకు టోల్‌ప్లాజాల వద్ద రుసుం మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఆక్సిజన్‌ సరఫరా చేసే కంటైనర్లను అత్యవసర వాహనాలుగా కేంద్రం గుర్తించింది. అంబులెన్సుల మాదిరిగా 2 నెలలపాటు అత్యవసర వాహనాలుగా పరిగణించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి :భారత సైన్యంలోకి తొలి మహిళా బ్యాచ్​ జవాన్లు

ABOUT THE AUTHOR

...view details