తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతుల కోసం దిల్లీ సరిహద్దులో తాత్కాలిక ఆసుపత్రి - సింఘు సరిహద్దులో తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటు

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలోని సింఘు సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులకు వైద్య సేవలందిస్తోన్న ఓ స్వచ్ఛంద సంస్థ.. అక్కడే ఓ తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండే ఈ ఆసుపత్రిని మరో రెండు రోజుల్లో అందుబాటులోకి తీసుకురానుంది.

NGO volunteers planning to set up two-bed temporary hospital at Singhu border
రైతుల కోసం సింఘులో రెండు పడకల ఆస్పత్రి ఏర్పాటు!

By

Published : Jan 6, 2021, 6:56 AM IST

దిల్లీలోని సింఘు సరిహద్దులో ఆందోళన చేస్తోన్న రైతుల కోసం.. రెండు పడకల తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని లైఫ్​ కేర్​ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్ణయించింది. మరో రెండు రోజుల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. వర్షం వచ్చినా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు టెంట్లు వేసి దీన్ని ఏర్పాటు చేయనున్నారు.

నిరసన చేస్తోన్న రైతులకు సేవ చేయాలనే లక్ష్యంగా.. 24 గంటల సౌకర్యంతో నవంబరు 30 నుంచి ఈ సంస్థ అక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఉష్ణోగ్రతలు క్షీణిస్తున్న తరుణంలో గుండె సంబంధిత బాధితులు పెరుగుతుండగా.. వారికోసం బుధవారం నుంచి ఈసీజీ సౌకర్యాన్నీ ప్రారంభించనుంది.

ఇదీ చదవండి:'జనవరి 7న దిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్​ ర్యాలీ'

ABOUT THE AUTHOR

...view details