NFC Apprentice Jobs : ఐటీఐ చేసి ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. భారత అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కంప్లెక్స్ (NFC) 206 అప్రెంటీస్ ఖాళీల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు వివిధ విభాగాలు/ ట్రేడ్‌ల్లో ఏడాదిపాటు అప్రెంటీస్ శిక్షణ ఇస్తుంది.
ఖాళీల వివరాలు
- ఫిట్టర్ - 42
- టర్నర్ - 32
- లేబరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్) - 6
- ఎలక్ట్రీషియన్ - 15
- మెషినిస్ట్ - 16
- మెషినిస్ట్ (గ్రైండర్) - 8
- అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్) - 15
- కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ - 14
- ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ - 7
- స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్) - 2
- కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ - 16
- వెల్డర్ - 16
- మెకానిక్ (డీజల్) - 4
- కార్పెంటర్ - 6
- ప్లంబర్ - 4
- మొత్తం - 206 పోస్టులు
విద్యార్హతలు
NFC Apprentice Qualification : అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి
NFC Apprentice Age Limit :అభ్యర్థుల వయస్సు అప్లికేషన్ చివరి తేదీ నాటికి 18 ఏళ్ల కంటే తక్కువ ఉండరాదు.
దరఖాస్తు రుసుము
అభ్యర్థులు.. అప్రెంటీస్ పోస్టులకు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.