తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భక్తులకు అలర్ట్​ - జనవరి 1న తిరుమలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా? ఈ విషయం తెలియకపోతే అంతే! - TTD Latest Update

TTD Latest Update : మరికొన్ని రోజుల్లో 2024 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ క్రమంలో జనవరి 1న శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకో బిగ్ అలర్ట్​. ఆ రోజు దర్శనాలకు సంబంధించి మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బంది పడడం ఖాయం. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Tirumala
Tirumala

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 3:45 PM IST

TTD Big Alert for Devotees on January 1st 2024 :ప్రతిరోజు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల కొండపైకి వస్తుంటారు. ఒక్కసారైనా ఆ ఏడుకొండలవాడిని కనులారా వీక్షించాలని కోరుకుంటారు. అంతేకాకుండా కాలినడక ద్వారా స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఇదిలా ఉంటే.. ఇక కొద్ది రోజుల్లో నూతన సంవత్సరం 2024లోకి ప్రవేశించబోతున్నాం. ఈ క్రమంలో చాలా మంది భక్తులు న్యూ ఇయర్​ మొదటి రోజు శ్రీవారి సన్నిధిలో గడపాలని కోరుకుంటారు.

TTD Latest News :అంతే కాకుండా ఆ రోజున స్వామి వారిని దర్శించుకుంటే సంవత్సరం అంతా మంచే జరుగుతుందని చాలా మంది భావిస్తారు. ఈ నేపథ్యంలో.. మీరు కూడా జనవరి 1వ తేదీ నాడు స్వామి వారిని దర్శించుకోవడానికి తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా?.. ఈ విషయం తప్పక తెలుసుకోండి. లేదంటే ఇబ్బందులు తప్పవు సుమీ.. ఎందుకంటే ఆ రోజు శ్రీవారి దర్శనానికి సంబంధించి ఇప్పటికే టీటీడీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అవేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సాధారణంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే తిరుమలలో(Tirumala) ఏదైనా పర్వదినం ఉంటే రద్దీ మరింత అధికంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే.. డిసెంబర్ 23న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆరోజు నుంచి 10 రోజులు అంటే (23 డిసెంబర్​ 2023 నుంచి 1 జనవరి 2024).. స్వామి వారిని భక్తులు ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు వీలుగా వాటికి సంబంధించి టైం స్లాట్ టోకెన్స్ జారీ ప్రక్రియను డిసెంబర్ 25(సోమవారం) ఉదయం పూర్తి చేసింది.

శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? తిరుమల కొండపై ఈ 5 తప్పులు చేయకండి!

దాదాపు 90 కౌంట‌ర్లలో 10 రోజుల‌కు గాను 4 ల‌క్ష‌లకుపైగా స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్లను టీటీడీ జారీ చేసింది. ఈ టోకెన్స్ తీసుకొచ్చిన భక్తులను.. అందులో ఉన్న డేట్, టైమ్ ప్రకారం.. క్యూలైన్​లలోకి వస్తే 3 గంటలలోపే తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కలిగించేలా టీటీడీ చర్యలు తీసుకుంటుంది. ఇక వైకుంఠ ద్వార దర్శనాలు 1వ తేది రాత్రి వరకు కొనసాగనున్నాయి. ఆరోజున ఈ దర్శనాలను ఏకాంత సేవ సమయంలో టీటీడీ ఆగమయోక్తంగా మూసివేయనుంది.

కాబట్టి జనవరి 1వ తేదీ నాడు తిరుమల వెళ్లాలనుకునే వారు ఈ విషయాన్ని గమనించాలి. కేవలం ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, టైం స్లాట్ టోకెన్స్ కలిగిన వారికే జనవరి 1వ తేదీన స్వామి వారిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఇక ప్రోటోకాల్ వీఐపీలకే బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని, సిపార్సు లేఖలపై దర్శనాలు కల్పించలేమని టీటీడీ తెలిపింది. ఇకపోతే తదుపరి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను జనవరి 2వ‌ తేదీ నుంచి ఇవ్వటం జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది.

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆస్తి ఎంతో మీకు తెలుసా..?

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - మార్చి నెల ఆర్జిత‌ సేవా టికెట్ల షెడ్యూల్ రిలీజ్!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details