తెలంగాణ

telangana

ETV Bharat / bharat

4 నెలల తర్వాత అత్యధిక కొవిడ్ కేసులు.. మాస్క్ తప్పదా?

భారత్​లో నాలుగు నెలల తర్వాత అత్యధిక కరోనా కేసులు పెరిగాయి. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని తెలిపింది. మరోవైపు, రాజస్థాన్​లో నలుగురు విదేశీ పర్యాటకులకు కొవిడ్ సోకింది.

india new covid cases today
భారత్​ కొత్త కోవిడ్ కేసులు

By

Published : Mar 16, 2023, 12:40 PM IST

నాలుగు నెలల తరువాత భారత్​లో అధిక కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు.. 754 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్​తో కర్ణాటక ఒకరు మృతి చెందారు. మొత్తంగా భారత్​లో 4,633 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2022 నవంబర్​లో అత్యధికంగా 734 కొవిడ్​ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఆ తరువాత బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు నమోదైన కేసులో అత్యధికమని తెలిపింది.

ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం..
కొవిడ్​ కారణంగా ఇప్పటి వరకు 5,30,790 మంది మరణించారు. భారత్​లో ఇప్పటివరకు నమోదైన కొవిడ్​ కేసుల సంఖ్య.. 4,46,92,710. ప్రస్తుతం 0.01 శాతం కొవిడ్ యాక్టివ్​ కేసులు ఉన్నాయి. కొవిడ్​ కేసుల రికవరీ శాతం 98.80గా ఉంది. కొవిడ్​ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,57,297కి పెరిగింది. మృతి చెందిన వారి శాతం 1.19గా ఉంది. దేశవ్యాప్తంగా 220.64 కోట్ల వాక్సిన్​ డోస్​లను ప్రజలకు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాజస్థాన్​లో ఆస్ట్రేలియా​ పర్యటకులకు కొవిడ్​ నిర్ధరణ..
రాజస్థాన్​లో.. నలుగురు ఆస్ట్రేలియా​ పర్యాటకులకు కొవిడ్​ నిర్ధరణ అయింది. దీంతో ఆ నలుగురిని రాజస్థాన్​ ప్రభుత్వం పరిశీలనలో ఉంచింది. వీరందరిని రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్​లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఈ విదేశీ పర్యటకులకు కొవిడ్​ నిర్ధరణ అయినట్లు వారు వెల్లడించారు.

"నలుగురు ఆస్ట్రేలియా పౌరులు.. సవాయి మాధోపుర్​లోని ఓ హోటల్​ బస చేశారు. వీరికి కొవిడ్​ నిర్ధరణ అయిన అనంతరం వారందరినీ జైపుర్​కు తరలించాం. నలుగురిలో ముగ్గురికి కొవిడ్ లక్షణాలు ఉన్నాయి. ఒకరికి మాత్రం జలుబు ఉంది." అని ఆర్​యూఎచ్​ఎస్​ సూపరింటెండెంట్ డాక్టర్​ అజిత్​ సింగ్​ తెలిపారు. బుధవారం రాజస్థాన్​లో మొత్తం 11 మందికి కొవిడ్​ నిర్ధరణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 56 యాక్టివ్​ కేసులు ఉన్నట్లు పేర్కొంది.

కొవిడ్​ ఎక్కువగా ప్రబలించేందుకు ఒమిక్రాన్​ దాని ఉప వేరియంట్లే కారణం..
దేశంలో కొవిడ్ కేసులు పెరిగేందుకు ఒమిక్రాన్​ దాని ఉప వేరియంట్లే కారణమని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి.. భారతి ప్రవీణ్​ పవార్​ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. గత నాలుగు నెలల్లో దేశవ్యాప్తంగా.. ఇండియన్ సార్స్​-కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం విశ్లేషించిన నమూనాలతో ఈ విషయం వెల్లడైనట్లు ఆమె పేర్కొన్నారు. పరీక్షల్లో 1900 కంటే ఎక్కువ.. ఒమిక్రాన్​ దాని సబ్-వేరియంట్‌లు గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details