తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహిళా ఖైదీలకు సరైన పునరావాసం కల్పించాలి'

జైలు జీవితం నుంచి బయటకొచ్చిన మహిళలు వివక్షకు గురవుతున్నారని.. ఈ పరిస్థితిలో మార్పు రావాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు. తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్న వారు సమాజంలో సులువుగా కలసిపోయేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

CJI
CJI

By

Published : Sep 16, 2021, 5:43 AM IST

మహిళా ఖైదీలు జైలు నుంచి బయటికొచ్చిన తర్వాత తిరిగి సాధారణ జనజీవన స్రవంతిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలిసిపోయేలా విభిన్న కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వాలకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు. జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ (నల్సా) పేట్రన్‌ ఇన్‌ చీఫ్‌గా వ్యవహరిస్తున్న ఆయన.. ఆ సంస్థ 32వ సెంట్రల్‌ అథారిటీ సమావేశాన్ని ఉద్దేశించి బుధవారం ప్రసంగించారు.

"జైలుశిక్షకు గురైన మహిళలు తరచూ తీవ్ర వివక్ష, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అది వారి పునరావాసానికి కఠిన సవాలుగా మారుతోంది. పురుషుల తరహాలోనే మహిళలూ జైలు నుంచి విడుదలయ్యాక సులభంగా జనజీవన స్రవంతిలో కలిసిపోయేలా వివిధ కార్యక్రమాలు, సేవలు అందుబాటులోకి తేవాలి."

-సీజేఐ

నల్సా ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ యు.యు.లలిత్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జైళ్లలో రద్దీ సమస్యను పరిష్కరించడంపై దృష్టిపెట్టాల్సిన అవసరముందన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details