భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి(covid in india) క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 43,509 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ బారిన పడి మరో 640 మంది ప్రాణాలు కోల్పోయారు. 38,465 మంది వైరస్ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 97.38శాతానికి చేరింది.
- మొత్తం కేసులు:3,15,28,114
- మొత్తం మరణాలు:4,22,662
- కోలుకున్నవారు:3,07,01,612
- యాక్టివ్ కేసులు:4,03,840
వ్యాక్సినేషన్:
దేశంలో ఇప్పటివరకు 45,07,06,257 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే 43,92,697 డోసులు అందించినట్లు తెలిపింది.