దేశంలో కరోనా కొత్త కేసులు, మరణాల్లో బుధవారం భారీ పెరుగుదల కన్పించింది. కొత్తగా 42,015 మందికి వైరస్ సోకినట్లు తేలింది. అంతకుముందురోజు374గా ఉన్న కొవిడ్ మృతుల సంఖ్య.. బుధవారం ఏకంగా 3,998కి పెరిగింది.
అయితే.. మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా సమాచారాన్ని 14వ సారి సవరించడం వల్లే ఈ స్థాయిలో బుధవారం మరణాల సంఖ్య నమోదైంది. ఆ రాష్ట్రం వెల్లడించిన మృతుల సంఖ్య 3,509, కేసుల సంఖ్య 2,479గా ఉంది. ఫలితంగా దేశంలో కొత్త మరణాల సంఖ్య 3,998కి చేరింది. మరోవైపు కొత్తగా 36,977 మంది వైరస్ను జయించారు.
- మొత్తం కేసులు:3,12,16,337
- మొత్తం మరణాలు:4,18,480
- కోలుకున్నవారు:3,03,90,687
- యాక్టివ్ కేసులు:4,07,170
ప్రస్తుతం క్రియాశీల రేటు 1.30 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.36 శాతానికి చేరింది.
వ్యాక్సినేషన్
దేశంలో ఇప్పటివరకు 41,54,72,455 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే 34,25,446 డోసులు అందించినట్లు తెలిపింది.