ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు గాల్‌బ్లాడర్ శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి వైద్యులు సోమవారం ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారని స్పష్టం చేశారు.
''మా పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌కి ఈ రోజు నిర్వహించిన లాప్రోస్కోపీ చికిత్స విజయవంతమైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. క్రమంగా కోలుకుంటున్నారు.''
-నవాబ్ మాలిక్, మహారాష్ట్ర మంత్రి.