తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గాంధీ హత్య', 'RSS బ్యాన్​' పాఠాలు తొలగింపు.. భగ్గుమన్న కాంగ్రెస్​

గాంధీజీ మరణం దాని ప్రభావం, RSS వంటి సంస్థలను నిషేధించడం వంటి పాఠ్యాంశాలను 12వ తరగతి పొలిటికల్‌ సైన్స్‌ పుస్తకాల నుంచి NCERT తొలగించింది. కొత్త విద్యాసంవత్సరం నుంచి ఆయా విషయాలు పాఠ్యపుస్తకాల్లో ఉండబోవని NCERT పేర్కొంది. విద్యార్థులపై భారం తగ్గించేందుకే హేతుబద్ధీకరణ చేపట్టినట్లు వివరించింది. దీనిపై కాంగ్రెస్‌ భగ్గుమంది. చరిత్రను ప్రభుత్వం వక్రీకరిస్తోందని ఆపేక్షించింది.

ncert deleted rss feed
ncert deleted rss feed

By

Published : Apr 5, 2023, 7:12 PM IST

Updated : Apr 5, 2023, 7:25 PM IST

గాంధీజీ మరణం, ఆనాటి మతపరిస్థితులు, హిందూ-ముస్లిం సమైఖ్యతకు గాంధీజీ చేసిన కృషి హిందూ అతివాదులను ఎలా రెచ్చగొట్టింది, RSS వంటి సంస్థలను దేశంలో నిషేధించిన ఘటనల గురించి వివరించే అనేక పాఠాలను 12వ తరగతి పొలిటికల్‌ సైన్స్‌ పుస్తకాల నుంచి NCERT తొలగించింది. హేతుబద్ధీకరించిన పాఠ్యపుస్తకాలు వచ్చే విద్యాసంవత్సరంలో అందుబాటులోకి రానున్నట్లు NCERT తెలిపింది. ఈ రేషనలైజేషన్‌ గతేడాది జూన్‌లోనే జరిగినట్లు పేర్కొన్న NCERT.. ఆయా అంశాలు ఇప్పటి పరిస్థితులకు సంబంధం లేనివిగా చెప్పింది. తొలగించిన వాటిలో గుజరాత్‌ అల్లర్లు, మొఘల్‌ కోర్టులు, అత్యయిక పరిస్థితి, ప్రచ్ఛన్న యుద్ధం, నక్సలైట్‌ ఉద్యమం వంటి అంశాలున్నాయి.

2022 జూన్‌లోనే పాఠ్యపుస్తకాల హేతుబద్ధీకరణ జరిగినట్లు NCERT తెలిపింది. కొవిడ్‌-19 కారణంగా ఉపాధ్యాయులతో అవసరం లేకుండా విద్యార్థులు స్వయంగా చదివి అర్థం చేసుకునేలా, సృజనాత్మక పెంపొందించేలా మార్పులు చేసినట్లు పేర్కొంది. దీంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపింది.

అయితే, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. పాఠ్యపుస్తకాల హేతుబద్ధీకరణ పేరుతో చరిత్రను వక్రీకరిస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది. చరిత్రను తిరగరాయడానికి యత్నించే వారు చరిత్రలో కనుమరుగైపోతారని వ్యాఖ్యానించింది. ప్రతీకారంతో వైట్‌వాష్‌ చేసేందుకు భాజపా యత్నిస్తోందని ఆరోపించింది. దళిత రచయితలు రాసిన పాఠ్యాంశాలను తొలగించే కుట్రగా అభివర్ణించింది. భాజపా, RSSలు ఎంత ప్రయత్నించినా దేశ చరిత్రను చెరిపివేయలేరని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ ఆరోపణలను కేంద్రమంత్రి శోభ కరండ్లాజే ఖండించారు. కాంగ్రెస్సే చరిత్ర మానిప్యులేటర్‌ అని.. వారుచేసిన తప్పులను భాజపా సరిదిద్దుతోందన్నారు. మొఘలుల అనాగరికత, ఎమర్జెన్సీ , కశ్మీర్ పండిట్లు, సిక్కుల ఊచకోత వంటి విషయాలను పాఠ్య పుస్తకాల్లో చేర్చలేదని దుయ్యబట్టారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా నెగటివ్ కంటెంట్​ రాశారని.. వాటిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు మహారాష్ట్ర బీజేపీ చీఫ్​ చంద్రశేఖర్​ బవాంకులే. ప్రపంచంలోనే గొప్ప దేశంగా మారేందుకు భారత్​ పయనిస్త్తున్న తరుణంలో ఇలాంటి నెగటివ్​ కంటెంట్​ అవసరం లేదని చెప్పారు.

కేంద్రం బాటలోనే ఉ్తతరాఖండ్​ సర్కార్​
మరోవైపు మొఘల్​ చరిత్రను పుస్తకాల నుంచి తొలగించాలన్న కేంద్ర నిర్ణయం బాటలోనే నడుస్తున్నాయి రాష్ట్రాలు. ఇప్పటికే ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని ప్రకటించింది. తాజాగా ఉత్తరాఖండ్​ సైతం ఈ జాబితాలో చేరనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొఘల్​ చరిత్ర పాఠాలను తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.

ఇవీ చదవండి :కేంద్ర సంస్థల 'దుర్వినియోగం'పై విచారణకు నో- పిటిషన్ ఉపసంహరించుకున్న విపక్షాలు

బెంగళూరు వాసికి జాక్​పాట్​.. లాటరీలో రూ.44 కోట్లు.. ఫ్రాంక్ అనుకొని నంబర్​ బ్లాక్​..

Last Updated : Apr 5, 2023, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details