తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.వెయ్యి కోట్ల డ్రగ్స్​ సీజ్​- ఇద్దరు శ్రీలంకన్ల అరెస్ట్​

మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న ఇద్దరు శ్రీలంకన్లను చెన్నైలో అరెస్టు చేశారు ఎన్​సీబీ అధికారులు. వారి నుంచి రూ.1,000 కోట్లు విలువైన హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నారు.

NCB arrests 2 Sri Lankans; heroin worth Rs 1,000 crore seized
రూ.వెయ్యి కోట్ల డ్రగ్స్​ సీజ్​- ఇద్దరు శ్రీలంకన్లు అరెస్ట్​

By

Published : Jan 22, 2021, 3:42 PM IST

దేశంలో నిషేధిత మత్తు పదార్థాల రవాణాను అడ్డుకోవడంలో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు శ్రీలంకన్లను అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1,000 కోట్లు విలువైన 100కిలోల హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు తమిళనాడు చెన్నైలో అక్రమంగా నివసిస్తున్న ఎంఎంఎం నవాజ్​​, మహ్మద్​ అఫ్నాస్​లుగా గుర్తించారు. వారికి పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​, ఇరాన్​, మాల్దీవుస్​ సహా ఆస్ట్రేలియా దేశాలతోనూ సంబంధాలున్నట్లు మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్​సీబీ) అధికారులు పేర్కొన్నారు.

నవాస్​, మహ్మద్​లు.. అంతర్జాతీయంగా డ్రగ్స్ సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఎన్​సీబీ డిప్యూటీ డైరెక్టర్​ కేపీఎస్​ మల్హోత్రా తెలిపారు. నవాజ్​​పై ఇంటర్​పోల్​ అధికారులు అరెస్టు వారెంట్​ కూడా జారీ చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:డ్రగ్స్​ ముఠా గుట్టురట్టు- దావూద్​ అనుచరుడు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details