ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్‌లో బుధవారం స్థానిక మార్కెట్‌కు వచ్చిన ఓ జవాన్‌ను మాటల్లో పెట్టి నక్సలైట్లు అతడి నుంచి రైఫిల్‌ను లాక్కెళ్లారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్‌లోని 16వ బెటాలియన్‌కు చెందిన జవాన్ ఓ స్థానిక మార్కెట్‌ను సందర్శించాడు. ఇంతలోనే స్థానిక వేషధారణలో వచ్చిన ముగ్గురు నక్సలైట్లు అక్కడ ఉన్న జవాన్ దగ్గరకు వచ్చారు.
మార్కెట్లో జవాన్‌తో నక్సలైట్ల ముచ్చట్లు.. ఏం జరుగుతుందో తెలిసేలోపే.. - నారాయణపూర్‌లో మార్కెట్లో నక్సలైట్లు
స్థానిక మార్కెట్‌కు వచ్చిన జవాన్‌ను మాటల్లో పెట్టి నక్సలైట్లు రైఫిల్‌ను లాక్కెళ్లిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్‌లో ఈ ఘటన జరిగింది.
నక్సలైట్లు
కాసేపు ఆయన్ను మాటల్లో పడేసి జవాన్ వద్ద ఉన్న రైఫిల్‌ను లాక్కొని పారిపోయారు. ఇది ఓర్చా పోలీస్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలో జరిగింది. "ఇది మార్కెట్ స్థలం, ప్రజలు చాలా మంది ఉన్నారు. ఇతర జవాన్లు కాల్పులు జరపడానికి వీలుకాలేదు. దాంతో నక్సలైట్లు పారిపోయారు. సమాచారం అందుకున్న తర్వాత ప్రత్యేక ఆపరేషన్‌ను ప్రారంభించారు." అని పోలీసు అధికారి పుష్కర్ శర్మ అన్నారు.