నారదా కుంభకోణం వ్యవహారానికి సంబంధించిన కేసులపై కోల్కతా హైకోర్టు గురువారం విచారణ చేపట్టనుంది. బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు నేటికి వాయిదా వేసింది. ప్రస్తుతం రెండు కేసులు హైకోర్టు పరిశీలనలో ఉన్నాయి. ఒకటి.. అరెస్టయిన ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే, కోల్కతా మాజీ మేయర్లకు బెయిల్ మంజూరుకు సంబంధించిన కేసు. రెండోది ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన మరో పిటిషన్. ఈ విషయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, న్యాయమంత్రి మలయ్ ఘటక్, తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీలను కక్షిదారులుగా సీబీఐ పేర్కొంది. అరెస్టులకు నిరసనగా ముఖ్యమంత్రి సీబీఐ కార్యాలయంలో ధర్నా చేశారని, న్యాయమంత్రి కోర్టుకు వచ్చి కూర్చొన్నారని తెలిపింది. ఇవి అసాధారణ పరిస్థితులు అయినందున కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. వీటిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ ఆర్జిత్ బెనర్జీలతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. విచారణ వాయిదా పడటం వల్ల ఆ నలుగురు నాయకులు బుధవారం కూడా జైలులో గడపాల్సి వచ్చింది.
పోలీసుల నివేదిక కోరిన గవర్నర్