తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 2:14 PM IST

ETV Bharat / bharat

నాంపల్లి ప్రమాదంపై గవర్నర్, సీఎం దిగ్భ్రాంతి - మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటన

Nampally Fire Accident Today : నాంపల్లి బజార్‌ఘాట్‌ అగ్నిప్రమాద ఘటనపై గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Nampally fire accident
Nampally fire accident

Nampally Fire Accident Today :హైదరాబాద్‌ నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో (Fire Accident in Nampally Bazarghat) భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంపై గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌ సహా పలువురు స్పందించారు. ఈ ఘటనపై తమిళిసై సౌందర రాజన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎస్‌ శాంతి కుమారిని ఆదేశించారు. ఈ ఘటనకు గల కారణాలు, తీసుకున్న చర్యలపై రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పాశమైలారంలోని ఆదిత్య ఫార్మాలో అగ్నిప్రమాదం

CM KCR Respond on Nampally Fire Accident : నాంపల్లి బజార్ ఘాట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.

Kishan Reddy on Nampally Fire Accident :నాంపల్లి ప్రమాద ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చూడాలని సూచించారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. నివాస ప్రాంతాల్లో రసాయనాలు ఎలా నిల్వ చేస్తారని.. దీని వెనుక ఉన్న బాధ్యులపై హత్య కేసు నమోదు చేయాలని అన్నారు. అధికారులు లంచం తీసుకుని అనుమతి ఇచ్చారని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.

KTR Respond on Nampally Fire Accident : నాంపల్లిలోని బజార్‌ఘాట్‌ అగ్నిప్రమాద స్థలాన్ని మంత్రి కేటీఆర్ (KTR) పరిశీలించారు. భవనం సెల్లార్‌లో రసాయనాలు నిల్వ ఉంచారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. మృతులకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు చెప్పారు. అస్వస్థతకు గురైన వారికి ఉస్మానియాలో మెరుగైన వైద్యం అందిస్తామని.. అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తామని కేటీఆర్‌ వెల్లడించారు.

Revanth Reddy on Nampally Fire Accident :నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై పీసీసీ అధ్యక్షుడురేవంత్‌రెడ్డి (Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిపోయిందని ఆరోపించారు. వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. రెసిడెన్షియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు ఎలా నిలువ చేశారని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని.. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Vanasthalipuram Fire Accident Today : వనస్థలిపురం బ్యాగుల దుకాణంలో అగ్నిప్రమాదం.. రూ. 15 లక్షల మేర ఆస్తి నష్టం

Fire Accident in Nampally Bazarghat Today : నాంపల్లిలోని బజార్‌ఘాట్‌ ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు.. అపార్ట్‌మెంట్‌లో అద్దెకుంటున్న అమాయకుల ప్రాణాలను కమ్మేశాయి. బజార్‌ఘాట్‌లోని నాలుగంతస్తుల అపార్ట్‌మెంట్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో డీజిల్, కెమికల్ డ్రమ్ములను నిల్వచేశారు. ప్రమాదవశాత్తు రసాయన డ్రమ్ములకు మంటలు అంటుకుని ఒక్కసారిగా పెద్దఎత్తున చెలరేగాయి. ఈ క్రమంలోనే గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి పై అంతస్తులకు మంటలు వ్యాపించి.. భవనమంతా పొగ కమ్మేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ 9 మంది మృతి చెందారు. భవనం నుంచి 21 మందిని బయటకు తీసుకువచి ఆసుపత్రికి తరలించారు. వారిలో 8 మంది అపస్మారక స్థితిలో ఉన్నారు.

Iraq Wedding Hall Fire : వెడ్డింగ్​ హాల్​లో భారీ అగ్నిప్రమాదం.. 114మంది మృతి.. మరో 150 మంది..

Fire Accident in Sangareddy : సంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. పేలిన రియాక్టర్లు

ABOUT THE AUTHOR

...view details