తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శ్మశానంలో బారసాల.. ఎందుకో తెలుసా?

చిన్నారుల బారసాలను ఎవరైనా ఇంట్లోనో.. లేదంటే ఏ గుడిలోనో జరుపుతారు. కానీ, కర్ణాటకలో మాత్రం ఓ కుటుంబం.. శ్మశానంలో నిర్వహించింది. అలా ఎందుకు చేశారో ఇది చదివి తెలుసుకోండి.

By

Published : Jan 18, 2021, 1:24 PM IST

Updated : Jan 18, 2021, 2:33 PM IST

eradicate superstitions
శ్మశానంలో బారసాల.. ఎందుకో తెలుసా?

కర్ణాటకలో ఓ చిన్నారి నామకరణ ఉత్సవం వినూత్నంగా జరిగింది. ఎవరూ ఊహించని విధంగా శ్మశానంలో పిల్లవాడికి బారసాల నిర్వహించారు. ఇలా ఎందుకు చేశారని అడగ్గా.. మూఢ నమ్మకాలపై అపోహలను తొలగించే ఉద్దేశంతోనే బారసాల అలా జరిపినట్లు చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపారు.

శ్మశానంలో బారసాల.. ఎందుకో తెలుసా?

బెళగావ్​ జిల్లా నిప్పాని తాలుకా, హున్నారాగిలో ఈ కార్యక్రమం జరిగింది. కేపీసీసీ కార్యదర్శి, యమకనమరదీ ఎమ్మెల్యే సతీష్​​ జరాకిహోలి నేతృత్వంలో బారసాల జరిగింది. పిల్లవాడికి భీమా రావ్​ అని నామకరణం చేశారు. డాక్టర్​. బీఆర్​ అంబేద్కర్​ లాగా ఈ చిన్నారి ఎదిగి దేశానికి పట్టిన మకలిని తొలగించాలని ఎమ్మెల్యే సతీష్​​ ఆకాంక్షించారు.

ఇదీ చూడండి:రైతులతో కలిసి రైల్లో భోజనం చేసిన తోమర్

Last Updated : Jan 18, 2021, 2:33 PM IST

ABOUT THE AUTHOR

...view details