Nails in head: రాజస్థాన్ జోధ్‌పుర్‌లోని ఎండీఎం ఆస్పత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసి ఓ యువకుడి ప్రాణాలు కాపాడారు. అతడి తలలోకి దిగిన 8 మేకులను బయటకు తీశారు. ఒక మేకు మెదడు లోపలకి చొచ్చుకెళ్లినా.. అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్ చేసి ఎలాంటి సమస్యా రాకుండా తొలగించారు. 10 రోజులు అబ్సర్వేషన్లో ఉంచిన అనంతరం డిశ్ఛార్జ్ చేశారు. ఇప్పుడు అతడు సాధారణ వ్యక్తిలా పూర్వస్థితికి వచ్చాడని వెల్లడించారు.
Jodhpur news
ఆస్పత్రిలోని న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్, ఆచార్య డా.శరద్ తన్వి నేతృత్వంలోని వైద్య నిపుణల బృందం ఈ ఆపరేషన్ చేసింది. డిసెంబర్ 18న 26 ఏళ్ల యువకుడిని ఆస్పత్రికి తీసుకొచ్చారని, పని చేస్తుండగా డ్రిల్ మెషిన్ నుంచి 8 మేకులు అతని తలలోకి దిగాయని చెప్పారు. ఓ మేకు అతడి మెదడులోకి లోతుగా దిగినట్లు ఎక్స్‌రే, సీటీ స్కాన్‌లో గుర్తించి అత్యంత జాగ్రత్తగా సర్జరీ చేసినట్లు చెప్పారు. ఆపరేషన్ కొంచెం అటు ఇటు అయినా యువకుడు జ్ఞాపకశక్తి కోల్పోవడమో, పక్షవాతం వచ్చే ప్రమాదమో ఉండేదన్నారు.