Nagarkurnool Suicide Case :కుటుంబ కలహాలతో ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం, హైదరాబాద్ నుంచి ఆమె మృతదేహాన్ని తిరిగి ఇంటికి తీసుకు వస్తుండగా, ఆమె భర్త హత్యకు గురి కావడం నాగర్‌కర్నూల్ జిల్లాలో సంచలనం రేపింది. మృతుల బంధువులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం, నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లికి చెందిన సింధు, అచ్చంపేట పట్టణానికి చెందిన నాగార్జున రెండేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అచ్చంపేటలోనే నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవల నేపథ్యంలో సింధు శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను భర్త నాగార్జున తొలుత అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. మళ్లీ అక్కడి నుంచి హైదరాబాద్ తరలించే క్రమంలో మార్గం మధ్యలో సింధు మృతి చెందింది.
హన్మకొండ ఎస్ఆర్ యూనివర్సిటీలో విషాదం - పరీక్షలో ఫెయిల్ అయినందుకు విద్యార్థిని ఆత్మహత్య
"నాగార్జునను సింధు వాళ్ల నాన్న, అమ్మ, మేనమామ ఇంకా కొంత మంది కలిసి చంపారని మేము అనుకుంటున్నాం. మాకు న్యాయం జరగాలని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి కంప్లెంట్ ఇచ్చాము. చాలా కిరాతకంగా చంపారు. సింధు తనంతట తానే సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు తరువాత నాగార్జున మిస్ అయ్యాడని ఫిర్యాదు చేశాము. హత్యలో ఎవరైతే ఉన్నారో వారందరికీ తగిన శిక్ష పడాలి."- నాగార్జున సోదరి
Nagarkarnool Murder Case : మృతదేహాన్ని అచ్చంపేటకు తీసుకువచ్చే క్రమంలో భర్త నాగార్జునను సింధు తరపు బంధువులు అంబులెన్స్ నుంచి దింపి మరో వాహనంలో తీసుకువెళ్లారు. అప్పటి వరకూ నాగార్జున వారి బంధువులతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. అంబులెన్స్ నుంచి దిగిపోయినప్పటి నుంచి నాగార్జున ఫోన్ కలవకుండా పోయింది. దీంతో ఆయన కుటుంబసభ్యులు డయల్ 100 ద్వారా పోలీసులను సంప్రదించారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆచూకీ వెతికిన పోలీసులకు కల్వకుర్తిలోని ఓ ప్రాంతంలో నిలిపి ఉన్న తుఫాన్లో నాగార్జున విగతజీవిగా కనిపించాడు. సింధు తరపు బంధువులే అతన్ని హత్య చేశారని నాగార్జున తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ట్రాన్స్‌జెండర్‌గా మారి వేధిస్తున్న భర్త - సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య