తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పింఛను​ ఖాతాలో రూ.52కోట్లు జమ- షాక్​లో వృద్ధుడు

పింఛను ఖాతాలో రూ.52కోట్ల బ్యాలెన్స్ చూసి ఓ వృద్ధుడు ఆనందంతో పాటు ఆశ్చర్యానికి గురయ్యాడు. బిహార్​ కటిహార్​లో ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో రూ.960కోట్లు జమ అయిన కొద్ది గంటల్లోనే ముజఫర్​పుర్​(Muzaffarpur News) ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

muzaffarpur-more-than-rs-52-crore-has-credited-in-the-bank-account-of-an-elderly-person
బ్యాంకు ఖాతాలో రూ.52కోట్ల జమ-

By

Published : Sep 17, 2021, 4:30 PM IST

బిహార్​లో(Bihar News) కొంతమంది బ్యాంకు ఖాతాల్లోకి కోట్ల రూపాయలు వచ్చిపడుతున్నాయి. కటిహార్​లో ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో రూ.960 కోట్లు జమ అయిన ఒక్క రోజు వ్యవధిలోనే ముజఫర్​లో(Muzaffarpur News) అలాంటి ఘటనే జరిగింది. ఓ వృద్ధుడి పింఛను ఖాతాలో ఏకంగా రూ.52కోట్లు జమ(Bihar Bank News) అయ్యాయి. బ్యాంకు బ్యాలెన్స్ చెక్​ చేసుకునేందుకు వెళ్లగా అతనికి ఈ విషయం తెలిసింది. దీంతో అతడు ఆనందంతో పాటు ఆశ్చర్యానికి గురయ్యాడు.

పింఛను​ ఖాతాలో రూ.52కోట్లు జమ- షాక్​లో వృద్ధుడు

ఖాతాల్లో కోట్లు జమ కావడంపై(bihar bank news today) స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మరోపైపు నగదు జమ అయిన వాళ్లు మాత్రం దాన్ని వినియోగించుకునేందుకు అధికారులు అనుతించకపోవడం వల్ల నిరాశ చెందుతున్నారు. అదృష్టం కలిసొచ్చినా అవకాశం దొరకట్లేదనుకుంటున్నారు.

పింఛను​ ఖాతాలో రూ.52కోట్లు జమ- షాక్​లో వృద్ధుడు

తన ఉత్తర్​ బిహార్ గ్రామీణ్​ బ్యాంకు ఖాతాలో డబ్బు ఎంత ఉందో చూసుకునేందుక సీఎస్​పీ ఆపరేటర్ వద్దకు వెళ్లినప్పుడు ఆధార్ వెరిఫికేషన్​ కోసం బొటనవేలు పెట్టగానే రూ.52కోట్ల బ్యాలెన్స్ కన్పించిందని వృద్ధుడు రామ్ బహదూర్​ షా మీడియాకు వెల్లడించారు. అది చూసి తాను ఆశ్చర్యపోయానని, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థంకాలేదని పేర్కొన్నారు. తాము వ్యవసాయం చేసి జీవనం సాగిస్తామని వివరించారు.

తమ ఖాతాలో ఇంత భారీ మొత్తం జమ కావడం ఆనందంగా ఉందని, వృద్ధాప్యంలో కొంత డబ్బు వినియోగించుకునేందుకు ప్రభుత్వం తమకు అనుమతి ఇవ్వాలని రామ్​ బహదూర్ డిమాండ్ చేశారు.

బిహార్​లో​ ఇలాంటి ఘటన జరగడం(Bihar Latest News) రోజుల వ్యవధిలోనే ఇది మూడోసారి. ఇటీవలే ఖగడియాలో ఓ యువకుడి ఖాతాలో రూ5.5లక్షలు జమ అయ్యాయి. కటిహార్​లో ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో రూ.960కోట్లు వచ్చి పడ్డాయి. ఇప్పుడు రామ్​బహదూర్​ పింఛను ఖాతాలో రూ.52కోట్లు క్రెడిట్ అయ్యాయి. అయితే ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియక అధికారులు అయోమయంలో ఉన్నారు. వీరి ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు.

ఇదీ చదవండి:ఆ విద్యార్థుల ఖాతాల్లో రూ.వందల కోట్లు.. ఎలా వచ్చాయ్​?

'నా ఖాతాలో ఆ డబ్బు మోదీనే జమచేశారు.. నేనివ్వను'

ABOUT THE AUTHOR

...view details