మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో దారుణం జరిగింది. వారం రోజుల క్రితం అదృశ్యమైన బాలిక శవమై తేలింది. బాలికను దుండగులు హత్యచేసి.. ప్లాస్టిక్ బ్యాగ్లో కుక్కి చిన్నారి ఇంటి సమీపంలోనే పూడ్చిపెట్టారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాలిక బంధువులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ విక్రమ్ సింగ్ తెలిపారు.