ప్రియుడి జన్మదిన వేడుకలకు వెళ్లిన 16 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారిలో ఆరుగురిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. మరోకరు పరారీలో ఉన్నట్లు వివరించారు. ఈ ఘటన నార్త్ ముంబయిలోని మల్వానీలో జరిగింది. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది..
నార్త్ ముంబయిలో జరిగిన ప్రియుడు పుట్టినరోజుకు యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. వెళ్లే సమయంలో తనను ఎవరూ అడ్డుకోకుండా ఇంటికి గొళ్లెం పెట్టింది. ప్రియుడి బర్త్డే పార్టీకి చేరుకుంది. అక్కడ అతని స్నేహితులు, అతను కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల తరువాత ఆమెకు కడుపులో నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం తనపై జరిగిన బలాత్కారం గురించి, నిందితుల గురించి వివరించింది. దీనిపై పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఆరుగురిని పట్టుకున్న పోలీసులు.. మరోకరి కోసం గాలిస్తున్నారు.