తెలంగాణ

telangana

By

Published : May 25, 2022, 3:16 PM IST

ETV Bharat / bharat

లక్కీ మహిళ.. గనిలో బయటపడిన వజ్రం.. ఒక్కసారిగా లక్షాధికారి...

వజ్రాల మైనింగ్ కోసం ప్రయత్నించి సఫలమయ్యారు మధ్యప్రదేశ్​కు చెందిన ఓ మహిళ. ఈ ఏడాది మార్చిలో మైన్ లీజుకు తీసుకోగా.. తాజాగా 2.08 క్యారెట్ల వజ్రం బయటపడింది. దీని విలువ రూ.10 లక్షలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

woman find diamond
woman find diamond

మధ్యప్రదేశ్​కు చెందిన ఓ మహిళ పంట పండింది. లీజుకు తీసుకున్న గనిలో 2.08 క్యారెట్ల వజ్రం దొరికింది. పన్నా జిల్లాలోని ఇత్వాకలా గ్రామంలో నివసించే చమేలి బాయి.. కృష్ణ కల్యాణ్​పుర్ పాటి ప్రాంతంలో వజ్రాల గనిని లీజుకు తీసుకున్నారు. ఈ ఏడాది మార్చిలోనే లీజుకు తీసుకొని మైనింగ్ ప్రారంభించారు. ఇక్కడే వీరికి ఈ వజ్రం దొరికింది.

చమేలి బాయి గనిలో దొరికిన వజ్రం

మంగళవారం పన్నా డైమండ్ ఆఫీస్​లో ఈ వజ్రాన్ని అధికారుల వద్ద డిపాజిట్ చేశారు చమేలి బాయి దంపతులు. దీనికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధర నిర్ణయించి త్వరలో వేలం వేస్తారు. వజ్రం నాణ్యతను బట్టి దీనికి రూ.10 లక్షల వరకు పలకొచ్చని అధికారులు తెలిపారు. వేలంలో వచ్చిన ధర నుంచి పన్నులు, రాయల్టీలను మినహాయించి మిగిలిన మొత్తాన్ని మహిళకు అప్పగిస్తామని చెప్పారు.

వజ్రాన్ని చూపిస్తున్న చమేలి బాయి

తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వజ్రాల గనిని లీజుకు తీసుకున్నామని చమేలి భర్త అర్వింద్ సింగ్ చెప్పుకొచ్చారు. వజ్రం దొరకడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వజ్రాన్ని వేలం వేసిన తర్వాత వచ్చిన సొమ్ముతో పన్నా నగరంలో ఇల్లు కొనుక్కుంటామని చెప్పారు. పన్నా జిల్లాలోని గనుల్లో 12 లక్షల క్యారెట్ల వజ్రాలు ఉన్నట్లు అధికారుల అంచనా.

మహిళను వరించిన అదృష్టం

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details