తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కార్మికులకు దొరికిన వజ్రాలు- వాటి ఖరీదు ఎంతంటే? - Panna diamond mines latest news

వజ్రాల గనిగా ప్రసిద్ధి గాంచిన మధ్యప్రదేశ్​ పన్నా జిల్లాలో ఇద్దరు వ్యక్తులకు 7.44, 14.98 క్యారెట్ల బరువున్న రెండు వజ్రాలు దొరికాయి. 7.44 క్యారెట్ల వజ్రం విలువ రూ. 30 లక్షలు కాగా.. 14.98 క్యారెట్ల బరువున్నది రెట్టింపు విలువ ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు.

MP: Labourers unearth two high-value diamonds in Panna
కార్మికులకు దొరికిన వజ్రాలు- ధరెంతో తెలుసా!

By

Published : Nov 3, 2020, 5:55 PM IST

మధ్యప్రదేశ్‌ పన్నా జిల్లాలోని వజ్రాల గనుల్లో 7.44, 14.98 క్యారెట్ల బరువున్న రెండు వజ్రాలు ఇద్దరు కార్మికులకు దొరికాయి. దీంతో ఆ ఇద్దరు ఒక్కరోజులో లక్షాధికారులు అయ్యారు.

జారువ్​పుర్​లో ఓ వజ్రాల గనిలో దిలీప్ మిస్త్రీకి 7.44 క్యారెట్ల వజ్రం దొరకగా.. అదే జిల్లాలోని కృష్ణ కల్యాణపుర్​ ప్రాంతంలో లఖన్​ యాదవ్​కు 14.98 క్యారెట్ల వజ్రం లభించినట్లు అధికారులు వెల్లడించారు. ఆ రెండింటిని వజ్రాల కార్యాలయానికి అందజేయగా.. వాటిని వేలం వేయనున్నారు. వచ్చిన ఆదాయంలో 12.5 శాతం తగ్గించి మిగిలినది లబ్ధిదారులకు అందిస్తామని అధికారులు చెప్పారు.

చిన్నది రూ. 30లక్షలు..

7.44 క్యారెట్ల వజ్రం ధర రూ. 30 లక్షలు పలుకుగా... రెట్టింపు బరువున్న పెద్ద వజ్రం సుమారు రూ. 60 లక్షల విలువ చేస్తుందని అధికారులు అంచనా వేశారు.

వజ్రాలు దొరికినందుకు సంతోషం వ్యక్తం చేశారు కార్మికులు. వచ్చిన డబ్బును పిల్లల చదువుకు ఉపయోగిస్తానని యాదవ్​ చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి:సీఎంకు చేదు అనుభవం.. ఉల్లితో ప్రజలు దాడి

ABOUT THE AUTHOR

...view details