తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​ 'ఉప' పోరులో గెలిచేది ఎవరు?

మధ్యప్రదేశ్​ రాజకీయాలు మరో ఉత్కంఠకర ఘట్టానికి చేరుకున్నాయి. 28 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

MP bypolls vote count on Tues; Scindia, Nath prestige at stake
మధ్యప్రదేశ్​ 'ఉప'పోరు గెలిచేది ఎవరు?

By

Published : Nov 9, 2020, 5:15 PM IST

Updated : Nov 9, 2020, 8:28 PM IST

మధ్యప్రదేశ్​లో 28 స్థానాలకు ఈ నెల 3న జరిగిన ఉపఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని గద్దెదించి భాజపా తీర్థం పుచ్చుకున్న 'జోతిరాదిత్య సింధియా' వర్గం భవితవ్యం ఈ ఫలితంతో తేలనుంది.

మొత్తం 19 జిల్లాల్లో మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు చేపట్టింది. ఈసీ సూచనల మేరకు.. కేవలం ఎన్నికల అభ్యర్థులు.. వారి పోలింగ్​ ఏజెంట్లు​, కౌంటింగ్​ ఏజెంట్లు​ మాత్రమే కేంద్రాల వద్ద ఉండాలి. ఫలితాలను కూడా కేంద్రాల బయట ఏర్పాటు చేసిన స్క్రీన్​ల మీద ప్రదర్శిస్తారు.

ఇదీ చూడండి:-'మార్పు' పవనాల మధ్య కౌంటింగ్​కు బిహార్​ సిద్ధం

కమల్​నాథ్​- సింధియాకు 'పరీక్ష'

ఈ ఉపఎన్నికలు కాంగ్రెస్​ సీనియర్​ నేత కమల్​నాథ్​- భాజపా యువనేత జోతిరాదిత్య సింధియాకు అసలైన పరీక్ష. 7 నెలల క్రితం.. కమల్​నాథ్​ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కుప్పకూల్చి.. భాజపా గూటికి చేరింది సింధియా వర్గం. ఫలితంగా ఖాళీలు ఏర్పడ్డ 25 స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. సిట్టింగ్​ ఎమ్మెల్యేల మృతితో మరో 3 నియోజకవర్గాలు ఈ జాబితాలో చేరాయి.

ఉపఎన్నికలను ఈ ఇరువురు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా ఉపపోరును తన ప్రతిష్ఠకు సంబంధించిన విషయంగా తీసుకున్నారు కమల్​నాథ్.​ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగించారు. కాంగ్రెస్​ తరఫున అన్ని తానై నడిపించారు.

230 సీట్లున్న మధ్యప్రదేశ్​ శాసనసభలో ప్రస్తుతం భాజపాకు 107, కాంగ్రెస్​కు 87మంది ఎమ్మెల్యేలున్నారు. మ్యాజికల్​ ఫిగర్​ను చేరుకోవాలంటే ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ నేతృత్వంలోని భాజపాకు మరో 8 సీట్లు దక్కితే చాలు. అయితే 28స్థానాల్లో అత్యధికంగా గెలిస్తే అసెంబ్లీలో కాంగ్రెస్​ తన బలాన్ని పెంచుకునే అవకాశముంటుంది.

రాష్ట్రంలో ప్రస్తుతం ఇలా

ఇదీ చూడండి:-'హస్తం​కు ఓటేయండి'.. భాజపా ప్రచారంలో సింథియా!

Last Updated : Nov 9, 2020, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details