మధ్యప్రదేశ్ సీధీ జిల్లాలోని పట్నా గ్రామంలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 54కు చేరింది. చివరగా తప్పిపోయిన వ్యక్తి మృతదేశాన్ని కాలువ నుంచి తీయడంతో గాలింపు చర్యలు ముగిసినట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటన ఈ నెల 16న జరిగింది. ఘటన జరిగే సమయంలో బస్సులో మొత్తం 61 మంది ప్రయాణికులు ఉన్నారు. అప్పుడే ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు.
మధ్యప్రదేశ్ బస్సు ప్రమాదంలో 54కు చేరిన మృతులు
మధ్యప్రదేశ్ సీధీ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి శనివారం మరో మృతదేహం బయటపడింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 54కి చేరింది.
ఎంపీ బస్సు ప్రమాదంలో 54కి చేరిన మృతుల సంఖ్య
అరవింద్ విశ్వకర్మ అనే వ్యక్తి మృతదేహాన్ని చివరిగా ప్రమాద స్థలం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్లు సీధీ కలెక్టర్ రవీంద్ర కుమార్ శర్మ తెలిపారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి అయిదు రోజుల పాటు సహాయ చర్యలు కొనసాగాయని పేర్కొన్నారు.