ఉద్యోగం కోల్పోయిన వేదనలో ఓ సివిల్ ఇంజినీర్(56) ఆత్మహత్యకు(bhopal civil engineer suicide) పాల్పడ్డాడు. తనతో పాటు కుటుంబాన్నీ తన వెంటే తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. ముందు.. తన కొడుకు(16), కూతురి(14) ప్రాణం తీయాలని భావించి.. ఆత్మహత్యకు ముందు భార్య(50)తో కలిసి ఇద్దరు పిల్లల గొంతు కోశాడు. అనంతరం, దంపతులిద్దరూ విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు.
మధ్యప్రదేశ్ భోపాల్ శివార్లలోని మిస్రోడ్ ప్రాంతంలో ఈ విషాదకర ఘటన జరిగింది. ఈ ఘటనలో తండ్రీకొడుకులు మరణించగా.. తల్లి, కూతురు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
"బాధితుడు గత మూడు నెలలుగా ఉద్యోగం లేకుండా ఉన్నాడు. ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా ప్రాణాలు తీసుకుందామని అనుకున్నారు. దంపతులిద్దరూ చనిపోయే ముందు.. తమ కొడుకు, కూతురి గొంతు కోశారు. సివిల్ ఇంజినీర్‌తో పాటు ఆయన కొడుకు ఇంట్లోనే చనిపోయారు. భార్య, కూతురిని ఆస్పత్రికి తరలించాం."