తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముగ్గురు పిల్లలను బావిలో పడేసి తల్లి హత్య.. ఆపై ఇంటికి నిప్పంటించుకుని.. - యువతిపై గ్యాంగ్​ రేప్​

ఉత్తరప్రదేశ్​లో ఓ కన్న తల్లి తన ముగ్గురు బిడ్డలను బావిలో పడేసి చంపి.. తరువాత తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మరోవైపు.. బిహార్​లో ఓ బాలికపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

girl raped by goons in kaimoor
Mother Threw Three Children in Well and try to suicide

By

Published : Jun 3, 2023, 9:17 PM IST

Updated : Jun 3, 2023, 10:21 PM IST

ఓ తల్లి తన ముగ్గురు కన్న బిడ్డలను బావిలో పడేసి చంపేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్​లో వెలుగుచూసింది. తరువాత తాను కూడా ఇంటికి నిప్పు అంటించుకుని బలవన్మరణానికి పాల్పడబోయింది. స్థానికులు సకాలంలో స్పందించి ఆమెను రక్షించారు. ఈ ఘటనలో ఏడాది వయసున్న చిన్నారి అను, రెండేళ్ల వయసున్న కీర్తి, 8 ఏళ్ల బాలుడు ఆకాశ్​ బావిలోనే మునిగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు.. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

పోలీసుల కథనం ప్రకారం... మీర్జాపూర్​లోని పజ్రా గ్రామంలో నివసిస్తున్న చందనకు, ముంబయిలో పని చేస్తున్న ఆమె భర్త అమర్​జీత్​ కౌల్​తో శుక్రవారం రాత్రి ఫోన్​లో గొడవ జరిగింది. దీంతో రాత్రి అందరూ పడుకున్న తరువాత.. క్షణికావేశంలో ఆమె తన ముగ్గురు పిల్లలను బావిలో పడేసింది. తరువాత తాను కూడా మరణించడానికి నిశ్చయించుకుని.. ఇంటికి నిప్పు అంటించుకుంది. తరువాత అగ్నిలో చిక్కుకుని.. భయంతో సాయం కోసం అరవడం మొదలు పెట్టింది. దీంతో స్థానికులు సకాలంలో స్పందించి ఆమెను రక్షించారు. కానీ బావిలోని బిడ్డలను కాపాడలేకపోయారు. పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు బావిలో నుంచి ముగ్గురు పిల్లల మృతదేహాలు వెలికి తీయించి.. పోస్ట్​మార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

బాలికపై సామూహిక అత్యాచారం
Goons raped a girl : బిహార్​.. కైమూర్​ జిల్లాలో బుక్సార్​ ప్రాంతంలో ఓ బాలికపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతకుముందు బాధితురాలిని.. నిందితులు ఒక ఆర్కెస్ట్రాలో నృత్యం చేసేందుకు ఒప్పించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ ఆమె నిరాకరించడం వల్ల.. స్కూల్​కు వెళ్తున్న బాధితురాలిని బలవంతంగా ఎత్తుకుపోయి ఓ గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలికను రోడ్డుపైనే వదిలేశారు నిందితులు.

దారిలో వెళ్తున్న గ్రామస్థులు బాలికను చూసి.. ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు మైనర్​ కావడం వల్ల అతనిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

అప్పుడు అత్యాచారం.. ఇప్పుడు కాల్పులు..
ఉత్తర్​ప్రదేశ్​.. ఉన్నావ్​లోని గంగా ఘాట్​ కొత్వాలీ ప్రాంతంలో దారుణం జరిగింది. ఒక యువతిపై.. ముగ్గురు వ్యక్తులు దారుణంగా కాల్పులు జరిపారు. వాస్తవానికి ఆ ముగ్గురు నిందితులు ఆరు సంవత్సరాల క్రితం ఆ బాలికపై అత్యాచారం చేశారు. అందుకు కోర్టు వారికి జైలు శిక్ష విధించింది. ఇప్పుడు బెయిల్​ వచ్చిన నిందితులు.. యువతి ఇంటి వద్ద కాపు కాశారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఆమె బయటకు రాగానే.. బైక్​పై వచ్చి కాల్పులు జరిపారు నిందితులు. ఈ ఘటన అంతా స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డ్​ అయ్యింది.

వాస్తవానికి బాధితురాలికి పోలీసులు రక్షణ కల్పిస్తున్నప్పటికీ నిందితులు ఈ దారుణానికి పాల్పడడం విశేషం. నిందితులు ఆమె ఇంటి తలుపులు బయట నుంచి మూసి వేసి, కాల్పులకు పాల్పడడం వల్ల పోలీసులు ఏమీ చేయలేకపోయారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు.. నిందితులు కేసు నమోదు చేసుకున్నారు.

Last Updated : Jun 3, 2023, 10:21 PM IST

ABOUT THE AUTHOR

...view details