Mother Of 8 Eloped With a 57 Year Old Man: రాజస్థాన్ భరత్‌పుర్‌లో 8 మంది పిల్లల తల్లి తన 57 ఏళ్ల ప్రియుడితో కలిసి పారిపోయింది. ఏప్రిల్ 24న తన భార్య 57 ఏళ్ల వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ ఆమె భర్త కైత్వారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మహిళను శనివారం కోర్టులో హాజరుపరిచారు. అయితే తాను స్వచ్ఛందంగా వెళ్లానని.. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తెలిపింది. భర్త, పిల్లల వద్దకు వెళ్లేందుకు మహిళ నిరాకరించింది.
ఎనిమిది మంది పిల్లలు, భర్తను వదిలి.. 57 ఏళ్ల ప్రియుడితో... - రాజస్థాన్ న్యూస్
Mother Of 8 Eloped With a 57 Year Old Man: 8 మంది పిల్లల తల్లి తన 57 ఏళ్ల ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో జరిగింది. ఆ మహిళను కోర్టులో హాజరుపరచగా.. పిల్లల వద్దకు వెళ్లేందుకు ఆమెం నిరాకరించింది.
Woman fleed with her lover in Bharatpur
మహిళ తన భర్త, పిల్లలతో కలిసి భరత్‌పుర్ నీమల గ్రామంలో నివసిస్తుంది. వారి ఇంటికి సమీపంలోనే 57 ఏళ్ల వ్యక్తి ఉండేవాడు. దీంతో తరచూ మహిళ అతడి ఇంటికి వెళుతూ ఉండేది. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో తన 8 మంది పిల్లలను వదిలి అతడితో పారిపోయింది. ఆరేళ్లుగా వీరిద్దరి మధ్య వ్యవహారం నడుస్తోందని, తన భార్యకు తాయత్తు ఇచ్చి లోబరుచుకున్నాడని.. మహిళ భర్త ఆరోపించాడు.
ఇదీ చదవండి:ముగ్గురు పిల్లలను చంపి బావిలో పడేసిన తండ్రి