Woman Kills Child: కేరళ కొట్టాయంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. 6వ బిడ్డకు జన్మనించినందుకు సమాజం అవమానిస్తుందనే భయంతో.. పసికందును హతమార్చింది ఓ తల్లి. ఆ తర్వాత పోలీసులకు కట్టుకథలు చెప్పింది.
ఇడక్కున్నమ్ ముక్కలి ప్రాంతంలో నివాసముంటున్న నిశా, సురేశ్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. గత శనివారం.. మరో మగబిడ్డకు జన్మనిచ్చింది నిశా. ఈ క్రమంలోనే ఆమెకు భయం పట్టుకుంది. సమాజంలో నవ్వులపాలు అవుతానని, అవమానానికి గురవుతానని భావించింది. దీనికి కుటుంబ ఆర్థిక కష్టాలు తోడయ్యాయి. అంతమంది బిడ్డలను పెంచడం కష్టమని.. చివరికి పసికందును బకెట్ నీళ్లల్లో ముంచి, ఊపిరాడనివ్వకుండా చేసి చంపేసింది.