Mother Kills Her Children: బిహార్ అనుప్పూర్‌లో దారుణం జరిగింది. కన్న తల్లే చిన్నారిని హత్య చేసింది. బిజూరికి చెందిన పుష్ప.. ఏడాదిన్నర వయసు గల కుమారుడిని గొంతు నులుమి చంపింది. డీఎన్ఏ రిపోర్టు రాకుండా ఉండేందుకే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితురాలిని అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది:బిజూరికి చెందిన సంజీత్ ప్యాంట్రీ కాంట్రాక్టర్. 2016లో పుష్పతో వివాహం జరగగా.. 4 ఏళ్ల కుమార్తె, ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. అయితే కొడుకు అవినాష్ తనకు పుట్టలేదని భార్యపై అనుమానం వ్యక్తం చేసేవాడు. ఈ విషయంపై ఇరువురి మధ్య తరచూ గొడవలు జరిగేవి. కుమారుడికి డీఎన్ఏ పరీక్ష చేయిస్తానని సంజీత్ చెప్పాడు. దీంతో అవినాష్‌ను గొంతు నులుమి హత్య చేసింది పుష్ప. ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో అవినాష్ పరిస్థితి విషమించడం వల్ల ఆస్పత్రికి తరలించగా.. మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సోమవారం ఉదయం శవపరీక్ష నివేదిక రావడం వల్ల హత్యగా తేలింది.
కుమారుడికి డీఎన్ఏ టెస్టు చేయిస్తానన్న తండ్రి.. గొంతునులుమి చంపిన తల్లి - బిహార్ న్యూస్
Mother Kills Her Children: కన్న తల్లే చిన్నారిని హత్య చేసిన ఘటన బిహార్ అనుప్పూర్‌లో జరిగింది. కుమారుడు తనకు పుట్టలేదని డీఎన్ఏ టెస్టు చేయిస్తానని భర్త చెప్పగా.. ఈ దారుణానికి పాల్పడింది. కేసు నమోదు చేసిన పోలీసుల నిందితురాలిని అరెస్ట్ చేశారు.
anuppur latest news