తమిళనాడుకు చెందిన 20 మందికిపైగా మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. వారి బోటులను స్వాధీనం చేసుకుంది. వారిని శ్రీలంకలోని కాంగేసంతురాయ్కు తీసుకువెళ్లింది.
శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిన మత్స్యకారులు రామేశ్వరానికి చెందిన 3 వేలమంది మత్స్యకారులు 500 పడవల్లో సముద్రంలోకి వేటకు వెళ్లగా.. శ్రీలంక నావికాదళం భారత జలాల్లోకి ప్రవేశించి తమపై దాడి చేసిందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. శ్రీలంక నావికాదళం తమను అడ్డుకుంటుందేమోనన్న భయంతో మత్స్యకారులు నలుదిక్కులు చెల్లాచెదురైనట్లు పేర్కొన్నారు.
శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిన మత్స్యకారులు శ్రీలంక నావికాదళం స్వాధీనం చేసుకున్న మత్స్యకారుల పడవలు మత్స్యకారుల అరెస్టును అన్ని మత్స్యకారుల సంఘాలు ఖండించాయి. దీనిపై బుధవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నాయి. ఈ ఘటనను ఎండీఎంకే జనరల్ సెక్రటరీ వైకో ఖండించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులను, వారి పడవలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:'రజనీ పార్టీ పేరు, గుర్తుపై త్వరలో క్లారిటీ'