తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మంకీ ఫీవర్​ కలకలం- ఆ రాష్ట్రంలో తొలికేసు

Monkey Fever in Kerala: కేరళలో మంకీ ఫీవర్ కలకలం రేపింది. వయనాడ్​ జిల్లాలో ఓ యువకుడికి ఈ జ్వరం సోకినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Monkey fever
Monkey fever

By

Published : Feb 10, 2022, 2:35 PM IST

Monkey Fever in Kerala: దేశంలో మళ్లీ మంకీ ఫీవర్ భయపెడుతోంది. గత నెల కర్ణాటకలో ఓ కేసు నమోదవగా.. తాజాగా కేరళ వయనాడ్​ జిల్లాలోని పనవళ్లీ గిరిజన ప్రాంతంలో 24 ఏళ్ల యువకుడికి ఈ జ్వరం సోకినట్లు తేలింది.

జ్వరంతో ఆస్పత్రికి చేరిన ఆ యువకుడికి మంకీ ఫీవర్​ లక్షణాలు ఉండగా.. వైద్య పరీక్షలు చేశారు. వారు అనుకున్నదే నిజమైంది. మనంతవాడీ వైద్య కళాశాలలో బాధితుడికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారు.

ఈ ఏడాది కేరళలో మంకీ ఫీవర్​ కేసు నమోదవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Monkey Fever Symptoms: మంకీ ఫీవర్​ దక్షిణాసియాలో కోతుల ద్వారా మనుషులకు సోకిన వైరల్ జబ్బు. ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన వైరస్​ వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అధిక జ్వరం, ఒళ్లు నొప్పులతో దాదాపుగా డెంగీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా 5 నుంచి 10 శాతం మరణాలు సంభవిస్తాయి.

ఇదీ చూడండి:'నీట్​'పై కోపం.. భాజపా ఆఫీస్​పై పెట్రోల్ బాంబుతో దాడి

ABOUT THE AUTHOR

...view details