ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు (Modi US visit 2021) సర్వం సిద్ధమైంది. మోదీ బుధవారం అమెరికాకు పయనం కానున్నారు. పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అవుతారు. (Modi US trip 2021) రక్షణ, భద్రత, వ్యాపార, పెట్టుబడుల అంశాలపై ఇరువురు చర్చించనున్నారు. ఇతర ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు సైతం వీరి మధ్య చర్చకు రానున్నాయి. అదే విధంగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తోనూ మోదీ సమావేశం కానున్నారు. కమల, మోదీ మధ్య జరిగే తొలి అధికారిక సమావేశం ఇదే కానుండటం విశేషం.
పర్యటనలో భాగంగా ప్రధానితో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా సైతం అమెరికా (Modi US trip 2021) వెళ్లనున్నారు.
కొవిడ్ సదస్సు..
అమెరికా అధ్యక్షుడు బుధవారం నిర్వహించే కొవిడ్ అంతర్జాతీయ సదస్సులో (Covid Global Summit) ప్రధాని మోదీ పాల్గొంటారని విదేశాంగ కార్యదర్శి శ్రింగ్లా తెలిపారు. మోదీ-బైడెన్ (Modi US trip 2021) ఉగ్రవాద కట్టడి అంశంపై ప్రధానంగా చర్చిస్తారని తెలిపారు. అఫ్గానిస్థాన్ పరిణామాలు సహా ప్రాంతీయ అంశాలపైనా మాట్లాడుకుంటారని చెప్పారు. దీంతో పాటు... సైబర్ సెక్యూరిటీ, సముద్ర భద్రత, మానవతా సహాయం, విపత్తు నిర్వహణ, వాతావరణ మార్పులు, విద్య, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ఇరువురు నేతలు సమాలోచనలు జరపనున్నట్లు వివరించారు.
క్వాడ్
సెప్టెంబర్ 24న జరగనున్న క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకు మోదీ ప్రత్యక్షంగా హాజరవుతారని (Modi Quad Summit) శ్రింగ్లా వివరించారు. సమకాలీన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై క్వాడ్ సదస్సులో చర్చించనున్నారని చెప్పారు. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ విజన్‌పై అభిప్రాయాలు పంచుకునేందుకు ఈ సమావేశం విలువైన అవకాశంగా నిలుస్తుందని పేర్కొన్నారు.