కరోనా(Covid virus) మూడో దశ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ, ఉన్నతాధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi).. గురువారం సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ఈ భేటీకి కేంద్ర హోమంత్రి అమిత్ షా, హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో సహా ఉన్నతాధికారులు హాజరవనున్నారు.
కరోనా మూడో దశ ఉద్ధృతిపై నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆక్సిజన్ నిల్వలు, సరఫరా, అత్యవసర ఔషధాలపై చర్చించనున్నారు. జమ్ముకశ్మీర్లో తాజా పరిస్థితులు, అమర్నాథ్ యాత్ర కొనసాగింపుపై మాట్లాడనున్నారని సమాచారం. సీఏఏ మార్గదర్శకాల రూపకల్పనపైనా చర్చించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.