తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రోహింగ్యాల తరలింపుపై భారత్​-బంగ్లా చర్చ' - భారత్​-బంగ్లాదేశ్​

భారత్​-బంగ్లాదేశ్​ మధ్య నిర్వహించిన వర్చువల్​ శిఖరాగ్ర సదస్సులో ప్రధానంగా నిరాశ్రయ రోహింగ్యాలను తిరిగి మయన్మార్​ పంపించాల్సిన అంశంపై చర్చించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ సదస్సు కీలక చర్చలతో ఫలప్రదమైనట్లు పేర్కొంది.

Ministry of External Affairs
స్మితా పంత్​

By

Published : Dec 17, 2020, 9:52 PM IST

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనా నిర్వహించిన వర్చువల్​ సదస్సు కీలక ప్రాజెక్టుల ప్రారంభం, సమగ్ర చర్చలతో ఫలప్రదమైనదిగా పేర్కొంది భారత విదేశాంగ శాఖ. ఈ సదస్సులో ప్రధానంగా మయన్మార్​ రాఖైన్​ రాష్ట్రానికి చెందిన రోహింగ్యాలను సురక్షితంగా, త్వరితగతిన తిరిగి స్వదేశానికి పంపించాల్సిన అవసరం ఉందని చర్చించినట్లు తెలిపింది.

"కీలక ప్రాజెక్టుల ప్రారంభం, సమగ్ర చర్చలతో ఈ సదస్సు ఫలప్రదమైనది. ఈ ద్వైపాక్షిక సదస్సులో.. రాఖైన్​ రాష్ట్రానికి చెందిన నిరాశ్రయ రోహింగ్యాలను సురక్షితంగా, సత్వరం మయన్మార్​కు తిరిగి పంపించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించాయి. సుమారు 11 లక్షల మంది నిరాశ్రయ రోహింగ్యాలకు ఆతిథ్యం ఇస్తున్న బంగ్లాదేశ్​ మానవతకు అభినందిస్తున్నాం. అర్థం చేసుకున్నాం. "

- స్మితా పంత్​, బంగ్లాదేశ్​-మయన్మార్​ సంయుక్త కార్యదర్శి, విదేశాంగ శాఖ.

మయన్మార్​లోని రాఖైన్​ రాష్ట్రం నుంచి వచ్చిన సుమారు 11 లక్షల మంది నిరాశ్రయ రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించటంపై ప్రధాని మోదీ అభినందించారని పేర్కొన్నారు స్మితా పంత్​. బంగ్లాదేశ్​లోని రోహింగ్యాలను మయన్మార్​ పంపించే కార్యక్రమానికి భారత్​ సాయం చేస్తుందనే నమ్మకం ఉన్నట్లు హసీనా వెల్లడించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: 7 ఒప్పందాలతో భారత్​- బంగ్లా స్నేహగీతం

ABOUT THE AUTHOR

...view details