తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Palam Air base: రావత్​ పార్థివదేహానికి మోదీ, ప్రముఖుల నివాళి - రాష్ట్రపతి రామ్​ నాథ్​ కోవింద్​

Mortal remains of cds: భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులు సహా 11 మంది సైనికులు భౌతికకాయాలకు నివాళులర్పించారు మోదీ, పలువురు ప్రముఖులు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

CDS General Rawat
రావత్​ పార్థివదేహానికి మోదీ సహా ప్రముఖుల నివాళి

By

Published : Dec 9, 2021, 9:06 PM IST

Updated : Dec 9, 2021, 9:24 PM IST

Mortal remains of cds: తమిళనాడు కూనూర్​లో బుధవారం జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన భార్య మధులిక రావత్​ సహా 11 మంది సైనికుల పార్థివదేహాలను దిల్లీలోని పాలం ఎయిర్​బేస్​కు తీసుకువచ్చారు. ఎయిర్​బేస్​కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అమరుల భౌతికకాయాలకు నివాళులర్పించారు. వారు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ

అంతకు ముందు ఎయిర్​బేస్​కు చేరుకున్న రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ పార్థివ దేహాలకు నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించారు. అమరుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

నివాళులర్పిస్తున్న రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​
నివాళులర్పిస్తున్న అజిత్​ డోభాల్​

భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులు సహా 11 మంది సైనికుల పార్థివ దేహాలకు నివాళులర్పించారు ఆర్మీ, వాయుసేన, నౌకాదళ అధినేతలు జనరల్​ ఎంఎం నరవాణె, మార్షల్​ వీఆర్​ చౌదరి, అడ్మిరల్​ ఆర్​ హరి కుమార్​. పాలం ఎయిర్​బేస్​కు చేరుకుని పుష్పాంజలి ఘటించారు. అమరులు కుంటుంబాలకు సంతాపం తెలిపారు.

నివాళులర్పిస్తున్న జనరల్​ ఎంఎం నరవాణె
అడ్మిరల్​ ఆర్​ హరి కుమార్​
మార్షల్​ వీఆర్​ చౌదరి

సూలూరు నుంచి దిల్లీకి..

గురువారం ఉదయం అమరుల భౌతికకాయాలను మద్రాస్‌ రెజిమెంటల్‌ కేంద్రం నుంచి సూలూరు బేస్‌ క్యాంపునకు తరలించారు. స్థానికులు మానవహారంలా ఏర్పడి అమరుల భౌతికకాయాలను తరలిస్తున్న అంబులెన్స్‌లపై దారి పొడుగున పూలవర్షం కురిపించారు. అక్కడి నుంచి నుంచి C-130J ఎయిర్‌క్రాప్ట్‌ భౌతికకాయాలతో గురువారం మధ్యాహ్నం బయలుదేరి.. సాయంత్రానికి దిల్లీ పాలం ఎయిర్​బేస్​కు చేరుకుంది. ప్రముఖులు, కుటుంబ సభ్యుల సందర్శనార్థం పార్థివదేహాలను ఏర్పాటు చేశారు.

Last Updated : Dec 9, 2021, 9:24 PM IST

ABOUT THE AUTHOR

...view details