కేరళ కొచ్చిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న 19 ఏళ్ల మోడల్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు యువకులు. అనంతరం బాధితురాలిని కారులో తీసుకెళ్లి కక్కనాడ్‌లోని ఆమె ఇంటివద్ద విడిచిపెట్టేశారు. ఈ ఘటనపై బాధితురాలి స్నేహితుడి ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. ఓ మహిళ సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి జరిగిందీ ఘటన. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గురువారం రాత్రి బాధితురాలు తన స్నేహితురాలితో కలిసి కొచ్చిలోని ఓ బార్కి వెళ్లింది. మద్యం తాగిన ఆమె.. స్పృహ తప్పిపడిపోయింది. యువతిని ఆమె ఇంట్లో దింపుతామని చెప్పి.. ముగ్గురు యువకులు కారులో తీసుకెళ్లారు. అనంతరం ఆమెను నగరంలో తిప్పుతూ కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు.. బాధితురాలి స్నేహితురాలిని ప్రశ్నించారు. ముగ్గురు నిందితులు కొడంగలూరుకు చెందినవారని ఆమె చెప్పింది.దీంతో వారిని అరెస్టు చేశారు.
భూతవైద్యం చేస్తానని నమ్మించి..
ఉత్తర్‌ప్రదేశ్ గోండాలో దారుణం జరిగింది. భూతవైద్యం చేస్తానని నమ్మించి ఓ వ్యక్తి మహిళపై ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అక్కడితో ఆగకుండా ఆమె కుమార్తెను సైతం లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. ఈ విషయం బాధితురాలి 16 ఏళ్ల కుమారుడికి తెలిసింది. దీంతో నిందితుడు మౌలానా జైనుల్ అబ్దిన్తో బాలుడు గొడవపడ్డాడు. ఈ క్రమంలో నిందితుడు.. బాలుడిని ఇంట్లోకి లాక్కెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.