ఉత్తర్‌ప్రదేశ్ భాజపా ఉపాధ్యక్షుడిగా ఎంఎల్సీ ఏకే శర్మ ఎంపికయ్యారు. ఈయన ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడిగా చెబుతుంటారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు కార్యదర్శిగా పనిచేశారు. అనుకున్న సమయానికి అశించిన ఫలితాలు వచ్చేలా పని చేయడం, వైబ్రంట్ గుజరాత్ ప్రచారం ద్వారా ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి కీలక పాత్ర పాత్ర పోషించి మోదీ విశ్వాసం చూరగొన్నారు. లాక్డౌన్ తరువాత ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం ప్రధాని ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్న కీలక విభాగం.. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
యూపీ భాజపా ఉపాధ్యక్షుడిగా మోదీ సన్నిహితుడు - bhp latest news
మాజీ ఐఏఎస్ అధికారి, ఎంఎల్సీ ఏకే శర్మ.. యూపీ భాజాపా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రధాని నరంద్ర మోదీకి సన్నిహితుడిగా పేరున్న ఈయనకు కీలక బాధ్యతలు అప్పజెప్పడం ప్రధాన్యం సంతరించుకుంది.
యూపీ భాజపా ఉపాధ్యక్షుడిగా మోదీ సన్నిహితుడు
ఏకే శర్మను ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. లఖ్‌నవూకు చెందిన అర్చనా మిశ్ర, బులంద్‌షహర్‌కు చెందిన అమిత్ వాల్మీకీని రాష్ట్ర కార్యదర్శులుగా నియమించినట్లు వెల్లడించారు.