తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కళ్లకు గంతలతో 'మిరాకిల్ కిడ్' సూపర్ సైకిల్​ రైడ్​.. కరెన్సీ నోట్లను ఈజీగా గుర్తుపడుతూ.. - ఎమోషనల్​ కోషెంట్ అంటే ఏమిటి

Miracle Kid In Varanasi : కళ్లకు గంతలు కట్టుకుని సైకిల్​ రైడ్​ చేస్తోంది ఓ 14 ఏళ్ల బాలిక. కరెన్సీ నోట్లు, దుస్తుల రంగులు సులభంగా గుర్తిస్తోంది. దీంతో ఆందరూ ఆమెను మిరాకిల్​ కిడ్​ అని పిలుస్తున్నారు. ఇంతకీ ఈ మిరాకిల్​ కిడ్​ కథ ఏంటంటే?

Miracle Kid In Varanasi
Miracle Kid In Varanasi

By

Published : Jul 4, 2023, 8:44 PM IST

కళ్లకు గంతలతో 'మిరాకిల్ కిడ్' సూపర్ సైకిల్​ రైడ్​

Miracle Kid In Varanasi : కళ్లకు గంతలతో ఓ 14 ఏళ్ల బాలిక సైకిల్​ రైడ్ చేస్తోంది. దుస్తుల రంగుల్ని, కరెన్సీ నోట్లను సులభంగా గుర్తిస్తోంది. తన స్నేహితులతో ఆడుతోంది కూడా. దీంతో ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మిరాకిల్​ కిడ్​ అని పిలుస్తున్నారు.​ ఆమెనే ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసి జిల్లాకు చెందిన రియా తివారీ.

ఇగీ జరిగింది.. లోహతా హర్​పాల్​పుర్​ గ్రామానికి చెందిన రియా తివారీ అనే 14 ఏళ్ల బాలిక పదో తరగతి చదువుతోంది. చదువుతో పాటు మెడిటేషన్​, యోగా లాంటి వాటిపై ఆసక్తి ఉన్న రియా.. తన తండ్రి ప్రొత్సాహంతో మిడ్​ బ్రెయిన్ యాక్టివేషన్​ కోర్సు చేసింది. మూడు నెలల పాటు సాగిన ఈ కోర్సులో మెడిటేషన్, యోగా, వ్యాయామం చేసింది. అనంతరం కళ్లకు గంతలు కట్టుకుని పరిసరాలను, రంగులను గుర్తించడం.. స్పర్శతో నోట్లను, పేక ముక్కలను సులభంగా గుర్తుపడుతోంది. కొన్ని కిలో మీటర్లు సైకిల్ రైడ్​ కూడా చేస్తోంది. యోగా, మెడిటేషన్​ చేస్తే ఇది సాధ్యమేనంటోంది రియా. వస్తువులను అనుభూతి చెంది గుర్తిస్తానని చెబుతోంది.

Mid Brain Activation Course : అయితే, రియాకు అసాధారాణమైన శక్తులు ఏమీ లేవని.. యోగా, మెడిటేషన్ చేస్తే ఎవరికైనా అది సాధ్యమేనని ఆమె తండ్రి రాజన్ తివారీ అన్నారు. మిడ్​ బ్రెయిన్ యాక్టివేషన్ కోర్సుతో ఇలా చేయొచ్చని చెప్పారు. 'ఈ కోర్సు పిల్లల జ్ఞాపకశక్తికి పదును పెడుతుంది. ఇందులో కళ్లకు గంతలు కట్టుకుని అన్నీ చూసే కళ నేర్పుతారు. రియా మామూలు పిల్లల్లాగే తన రోజువారీ పనులను చేస్తుంది. అంతే కాకుండా.. కళ్లకు గంతలతో కూడా ఆ పనులన్నీ సులభంగా చేస్తుంది. అలాంటి పిల్లలు పోటీ పరీక్షల్లో సులభంగా ఉత్తీర్ణులవుతారు' అని రాజన్​ అన్నారు.

మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అంటే ఏమిటి?
What Is Mid Brain Activation : మెదడులో మూడు భాగాలుంటాయి. కుడి, ఎడమ మెదడు కాకుండా, రెండింటినీ అనుసంధానించే భాగాన్ని ఇంటర్ బ్రెయిన్ లేదా మిడ్ బ్రెయిన్ అంటారు. సాధారణంగా ప్రజలు ఎడమ మెదడును ఉపయోగిస్తారు. కుడి మెదడు వాడకం చాలా తక్కువ. ఒక వ్యక్తి మెదడులోని చిన్న భాగాన్ని, ఎడమ మెదడును మాత్రమే ఉపయోగించగలడు.

ఈ భాగం తార్కిక (లాజికల్) సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కుడి మెదడు కూడా చాలా శక్తివంతమైనదే. కానీ దాని ఉపయోగం అరుదుగా సాధ్యమవుతుంది. రెండు అర్ధ మెదళ్ల మధ్య బ్రిడ్జ్​ చురుకుగా మారినపుడు, పిల్లలు ఆల్ రౌండర్ అవుతాడు. అలాంటి పిల్లల ఇంటెలిజెన్స్ కోషెంట్ (Intelligence Quotient), ఎమోషనల్​ కోషెంట్​ (Emotional Quotient ) ఏకకాలంలో పెరుగుతాయి. చదువులు, తార్కిక ఆలోచనలు మొదలైన వాటికి ఎడమ మెదడు చాలా ముఖ్యమైనది. సృజనాత్మక ఆలోచన, సృజనాత్మకతకు కుడి మెదడు అవసరం.

ABOUT THE AUTHOR

...view details