Man Murdered Live In Partner In Maharashtra : మహారాష్ట్ర ఠాణెలో సహజీవన భాగస్వామిని అతి కిరాతకంగా చంపిన కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వారం క్రితం జరిగిన ఈ ఘటనలో.. సరస్వతి మృతదేహాన్ని ఛిద్రం చేసేందుకు పదునైన ఆయుధాన్ని, ఎలక్ట్రిక్ రంపాన్ని మనోజ్ ఉపయోగించాడని పోలీసులు తెలిపారు. మధ్యలో దాని చైన్ తెగిపోయిందని.. అనంతరం రిపేర్ చేయించి మరి ఘటనకు పాల్పడ్డాడని వారు వెల్లడించారు. మనోజ్ సెక్స్‌కు, మద్యానికి, ధూమపానానికి బానిస అయ్యాడని తెలిపిన పోలీసులు.. అతడి మొబైల్లోనూ అసభ్యకరమైన ఫొటోలను గుర్తించినట్లు వివరించారు.
"మనోజ్ ఎక్కువగా పోర్న్ సైట్లు చూస్తుండేవాడు. డేటింగ్ యాప్‌లలో చురుగ్గా ఉండేవాడు. అతడు మరికొంత మంది యువతులతోనూ సంబంధాలు కలిగి ఉన్నాడు. ఈ విషయం సరస్వతికి తెలియడం వల్ల.. వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనోజ్.. సరస్వతిని హత్య చేశాడు. ఇంట్లో సరస్వతి ఒంటరిగా ఉండేది. ఆమె ఎవ్వరితోనూ మాట్లాడేది కాదు. ఆమెకు చుట్టు పక్కల వారేవ్వరు పరిచయం లేరు. ఆమె రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉండేది. సరస్వతి మొబైల్‌ను కూడా మనోజే వినియోగించేవాడు. ఆమె సోదరిని కూడా కలవనిచ్చేవాడు కాదు మనోజ్. హత్య అనంతరం సరస్వతి శవంతో మనోజ్ సెల్ఫీలు దిగాడు."
--పోలీసులు
తాను నపుంసకుడినని చెప్పుకుంటున్న మనోజ్..
తాను నపుంసకుడినని, అనారోగ్యంతో బాధపడుతున్నానని పోలీసులకు తెలిపాడు మనోజ్. కాగా వాటిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిందితుడు చెప్పేది నిజమా? అబద్ధమా? అని తెలుసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మనోజ్ ఇంట్లో క్రిమి సంహారక మందులు లభించాయని పోలీసులు తెలిపారు. సరస్వతికి.. నిందితుడు ఈ క్రిమి సంహారక మందులు తాగించి చంపేశాడా అన్న కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సరస్వతి ఆత్మహత్య చేసుకుందని.. మనోజ్ పదే పదే చెబుతున్నాడన్న పోలీసులు.. అవేవి నమ్మశక్యంగా లేవంటున్నారు. ఘటనను హత్యననే పోలీసులు భావిస్తున్నారు. కాగా మర్డర్ ఎలా జరిగిందన్న దానిపై.. పోలీసులు విచారణ జరుపుతున్నారు. సరస్వతి మృతదేహాన్ని బాగా ఛిద్రం చేయడం వల్ల పరీక్షలు చేసేందుకు ఇబ్బందిగా మారిందని వైద్యులు చెబుతున్నారు.
మహారాష్ట్రలోని ఠాణెలో సహజీవన భాగస్వామి హత్య హత్య ఘటన వివరాలు..
Mira Road Murder Case : మృతురాలు సరస్వతి వైద్య (36), నిందితుడు మనోజ్ సహానీ (56) సహజీవనం చేస్తూ ఠాణెలోని మీరా రోడ్ అపార్ట్మెంట్లో గత మూడేళ్లుగా నివాసం ఉంటున్నారు. అయితే, బుధవారం వారి ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన పొరుగింటివారు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అపార్ట్‌మెంట్‌కు వచ్చి పరిశీలించిన పోలీసులకు.. గదిలో మృతదేహం లభించింది. దీంతో సరస్వతి హత్య వెలుగులోకి వచ్చింది. ముక్కలు ముక్కలుగా నరికిన శరీర భాగాలు.. బకెట్లలో కనిపించాయని పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల క్రితమే హత్య జరిగి ఉంటుందని వారు అనుమానించారు.
మహారాష్ట్రలోని ఠాణెలో సహజీవన భాగస్వామి హత్య Body parts boiled in cooker : సహానీ బెడ్రూమ్లో భారీ ప్లాస్టిక్ బ్యాగులు, రక్తపు మడుగులో ఉన్న చెట్లు నరికే యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రెజర్ కుక్కర్‌తో పాటు గిన్నెల్లో శరీర భాగాలను ఉడకబెట్టినట్లు గుర్తించారు. ఇంకొన్ని శరీర భాగాలను మిక్సీలో వేసినట్లు తెలిపారు. మహిళ వెంట్రుకలు, సగం కాలిన ఎముకలు, శరీర భాగాలు కిచెన్ సింక్‌లో, బకెట్లలో కనిపించాయి. వీటన్నింటినీ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుుకున్నారు.