తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆరేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం - పానిపట్ సివిల్ ఆసుపత్రి

Minor Girl Rape: ఆరేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హరియాణాలోని పానీపత్​ జిల్లాలో ఆదివారం జరిగింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు.

minor rape
మైనర్ రేప్

By

Published : Mar 7, 2022, 10:31 AM IST

Minor Girl Rape: హరియాణాలో దారుణం జరిగింది. అరేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన హరియాణాలోని పానీపత్​​లో ఆదివారం జరిగింది.

ఇదీ జరిగింది..

పానీపత్​ జిల్లాలోని తెహసిల్ క్యాంపు ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో వలస కూలీలు పని చేస్తున్నారు. తల్లిదండ్రులతో వచ్చిన బాలిక.. పరిశ్రమ ప్రాంగణంలో ఆడుకుంటుండగా.. అక్కడే పని చేస్తున్న నిందితుడు ఫ్యాక్టరీపైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు తీవ్ర రక్తస్రావంతో ఏడుస్తూ వచ్చి.. కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని చెప్పాంది. హుటాహుటిన ఆమెను పానీపత్​లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు.

పానీపత్ ఎస్పీ పూజా వశిష్ఠ్ సివిల్ ఆసుపత్రికి చేరుకుని బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: స్నేహితులతో కలిసి విద్యార్థినిపై జవాను గ్యాంగ్​రేప్​

ABOUT THE AUTHOR

...view details